S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/01/2018 - 01:03

హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అవకాశ వాది అనీ, మహబూబ్‌నగర్ ప్రజలనేగాక, జోగులాంబ అమ్మవారినీ మోసం చేసిన ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఎలా లభిస్తాయని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల నుంచి టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె శనివారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.

07/01/2018 - 01:00

హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కౌలు రైతులపై విషం కక్కుతున్నారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ధ్వజమెత్తారు. కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేసే ప్రసక్తే లేదని

07/01/2018 - 00:58

హైదరాబాద్, జూన్ 30: తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు అమలుపై ఉన్నతాధికారులతో శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమై, సమీక్షించిన కేసీఆర్ మాట్లాడుతూ, ఈ పథకం పంట పెట్టుబడి కోసం రైతులకు మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఇది రైతు బంధుపథకం తప్ప కౌలు రైతుబంధు పథకం ఎంతమాత్రం కాదని వ్యాఖ్యానించారు.

07/01/2018 - 02:09

తిరుపతి, జూన్ 30: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి మనదేశం నాయకత్వం వహించే శక్తి ఉందని, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలను అందుకుంటున్నా ఇంకా అనేక అంశాలు మన ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయని అందులో స్వచ్ఛమైన తాగునీరు, పేదరిక నిర్మూలన, పారిశుద్ధ్యం, నాణ్యమైన విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ఉపాధి లాంటివి ప్రధానమైనవని, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంటే అది నీటి కోసమేనని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ

07/01/2018 - 00:35

రాజమహేంద్రవరం, జూన్ 30: ముందస్తు ఖరీఫ్ చేపట్టాలన్న సంకల్పంతో ఏటా జూన్ ఒకటి నుంచే గోదావరి డెల్టాల్లో సాగు జలాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. గత రెండేళ్లుగా ఇది కృష్ణా డెల్టాలో సాధ్యపడుతున్నా, గోదావరి డెల్టాలో మాత్రం ముందస్తు ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధం కావడం లేదు. జూన్ మొదటి నుంచి సాగునీరు అందిస్తే..

07/01/2018 - 00:32

బళ్లారి, జూన్ 30: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నా భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు జలాశయానికి వేగంగా చేరుతోంది. శనివారం 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు జలాశయం అధికారులు తెలిపారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా శనివారం 1607.79 అడుగులకు చేరుకుంది.

07/01/2018 - 00:30

అమరావతి, జూన్ 30: అవినీతి నిరోధక శాఖ డీజీగా పనిచేస్తున్న రాష్ట్ర ఆర్‌పీ ఠాకూర్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా నియమితులయ్యారు. కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఐదుగురు పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

07/01/2018 - 00:28

అమలాపురం, జూన్ 30: వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తామని, అలాగే వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు మరో రూ.50 వేలు మెస్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

07/01/2018 - 01:17

కడప: ఉక్కు పరిశ్రమ కోసం కడప జిల్లా పరిషత్ ఆవరణలో 11 రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన వైద్యపరీక్షల రిపోర్టులను తీసుకుని డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి నుండి శిబిరానికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ బీటెక్ రవిని పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని సీఎం రమేష్‌కు నచ్చజెప్పారు.

07/01/2018 - 00:20

కడప, జూన్ 30: కడప ఉక్కు కర్మాగారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి దాదాపు అల్టిమేటం ఇచ్చారు. రెండు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటే అందుకు తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు. ‘మేము 50 శాతం పెట్టుబడి పెడతాం. మీరూ 50 శాతం పెట్టండి.. ఇది కాకపోతే మూడవ మార్గంగా మేమే ఉక్కు పరిశ్రమ పెడతాం’ అంటూ సభికుల హర్షధ్వానాల మధ్య సీఎం ప్రకటించారు.

Pages