S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/30/2018 - 01:14

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆవిర్భవించిన తర్వాత చాలా నోటిఫికేషన్ల జారీకి రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చినా, అనేక సాంకేతిక కారణాలతో సకాలంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో నిరాశ చెందిన రాష్ట్రప్రభుత్వం గురుకులాల రిక్రూట్‌మెంట్ బోర్డుకు శ్రీకారం చుట్టింది.

06/30/2018 - 01:08

హైదరాబాద్, జూన్ 29: నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా ఉపాధి శిక్షణ ఇస్తున్న ఎన్‌టీఆర్ ట్రస్ట్ జూలై 4 నుంచి కుకరీ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ప్రీడం సంస్థ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో స్వీట్స్, చైనీస్, బ్రేక్‌ఫాస్ట్, బేకరీ ఐటమ్స్ తయారీ పద్దతులపై శిక్షణ ఇవ్వనున్నారు.

06/30/2018 - 01:06

హైదరాబాద్, జూన్ 29: తిరుమల తిరుపతి దేవస్థానంకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చులపై సిబిఐ విచారణ చేపట్టాలని శుక్రవారం హైకోర్టులో ఫిటీషన్ దాఖలు అయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన బూరగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టులో ఫిటీషన్ దాఖలు చేస్తూ తిరుమలలో ఆగమశాస్త్ర, నేలమాలిగలపై కమిషనర్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇటీవల కేంద్ర పురావస్తుశాఖ విడుదల చేసిన అంశాలపై విచారణ చేపట్టాలన్నారు.

06/30/2018 - 00:41

హైదరాబాద్, జూన్ 29: తమ పార్టీ ఇంకో 15 ఏళ్లపాటు అధికారంలో ఉండటంతో పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని గాలి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణాను తామే ఇచ్చామని చెబుతుంటారని, అసలు తెలంగాణ ఇచ్చింది అమ్మకాదు, బొమ్మకాదు వందలాది మంది బలిదానాలతో వచ్చిందని కేటిఆర్ వెల్లడించారు.

06/30/2018 - 00:36

శాంతినగర్, జూన్ 29: జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన కేసీఆర్ 15 అంశాలకు
సంబంధించిన హామీలను ఇచ్చి నేటివరకు నెరవేర్చని కారణంగా

06/30/2018 - 00:34

మహబూబ్‌నగర్/అయిజ, జూన్ 29: ‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ నన్ను దీవించండి. మీకు మళ్లీ సేవచేసే అవకాశం కల్పించండి’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అలాగే గద్వాల నియోజకవర్గంలోని గట్టు ఎత్తిపోతల పథకం పనులకు పైలాన్‌ను ఆవిష్కరించారు.

06/30/2018 - 00:26

హైదరాబాద్, జూన్ 29: ప్రభుత్వం తమను సస్పెండ్ చేసినా, మరోటి చేసినా తాము మాత్రం డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని రేషన్ డీలర్ల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం తమకు గడువు పెట్టడం కాదు తామే ప్రభుత్వానికి జూలై 5 వరకు డిమాండ్ల పరిష్కారానికి గడువు పెట్టి ఆ మరుసటి రోజు నుంచి హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్షకు

06/30/2018 - 00:24

హైదరాబాద్, జూన్ 29: కర్నాటక తరహా ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సీఎల్‌పీ నేత కె. జానారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుందని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్ని సీట్లు వస్తాయనేది తాను చెప్పనని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని జానా వెల్లడించారు.

06/30/2018 - 00:24

హైదరాబాద్, జూన్ 29: ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు కాంగ్రెస్ కూడా సిద్ధమేనా? అని ప్రశ్నించడంతో సార్వత్రిక ఎన్నికలకు 11 నెలలకు ముందే ఆ వాతావరణం నెలకొంటున్నది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దక్షిణ తెలంగాణపై, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించారు.

06/30/2018 - 00:20

హైదరాబాద్, జూన్ 29: భారత్- అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై టు ప్లస్ టు చర్చలు వాయిదా ప్రభావం ఏమీ ఉండదని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

Pages