S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/09/2018 - 12:38

హైదరాబాద్‌ : నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 22ఏళ్ల విద్యార్థి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంకరపల్లి మండలం మొకీల గ్రామంలో అనంత్‌ రెడ్డి కుమారుడు రాహుల్‌ బెంజ్‌కారులో ఫిల్మ్‌నగర్‌ నుంచి మణికొండ వైపు వెళ్తున్నాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి మూడు పాల్టీలు కొట్టింది.

06/09/2018 - 12:20

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. నిన్న ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఈ రోజు ఉదయం వరకు నిరంతరాయంగా కొనసాగింది. పంపిణీ సందర్భంగా మూడువేల మంది అధికారులు, సిబ్బంది సేవలందించారు. ఇప్పటి వరకు 75,631 మంది చేప ప్రసాదం స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

06/09/2018 - 05:42

రాజవొమ్మంగి: ప్రపంచంలో ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సమయంలో విశ్వాన్ని జయించినంత ఆనందం కలిగిందని ఇటీవల ఆ శిఖరాన్ని అధిరోహించిన గిరిజన విద్యార్థి ప్రసన్నకుమార్ తెలిపాడు. శిఖరాన్ని చేరిన వెంటనే సుమారు 48 రోజులు పడిన కష్టాన్ని మరచిపోయానన్నాడు. ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ప్రసన్నకుమార్ శుక్రవారం తన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్లకు చేరుకున్నాడు.

06/09/2018 - 04:16

న్యూఢిల్లీ, జూన్ 8: భారత్ బ్యాంకులను మోసం చేసి లండన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే విషయమై అ న్ని చర్యలను తీసుకుంటున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

06/09/2018 - 04:15

కర్నూలు, జూన్ 8: ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత క్యాట్ ఫిష్‌ను కర్నూలు జిల్లా గడివేముల మండలంలో పెంచుతున్నారు. ఏకంగా 20 చెరువుల్లో క్యాట్‌ఫిష్ పెంచుతున్నట్లు సమాచారం. ఇక్కడ పెంచిన చేపలను నంద్యాల నుంచి రైళ్ల ద్వారా విశాఖపట్టణం, విజయవాడ, కోల్‌కత్తా నగరాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

06/09/2018 - 04:49

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో .....
రంజాన్ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన దావత్-ఎ-ఇఫ్తార్ విందులో
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో ముచ్చటిస్తున్న సీఎం కేసీఆర్

06/09/2018 - 02:55

హైదరాబాద్, జూన్ 8: కార్మికులు సమ్మెకు దిగితే సంస్థ మనుగడే కష్టమని ఆర్టీసీ యాజమాన్యం అంటుంటే, సమ్మె విషయంలో మడమతిప్పే ఆలోచనేదీ లేదని కార్మిక సంఘాలు తేల్చి చెబుతున్నాయి. సమ్మెకు దిగితే ఉద్యోగాల ఉద్వాసన తప్పదని సీఎం కేసీఆర్ హెచ్చరించినా, లక్ష్యపెట్టని కార్మికులు సమ్మెకు సమాయత్తం అవుతున్నారు.

06/09/2018 - 04:51

హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ...
మృగశిరకార్తెలో ఏటా బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్‌లో శుక్రవారం అట్టహాసంగా మొదలైంది. ప్రసాదం కోసం జనం బారులు తీరారు. ఓ పసిబిడ్డకు వాలంటీర్ చేప ప్రసాదం వేస్తుంటే మురిపెంగా చూస్తున్న కన్న తల్లి

06/09/2018 - 02:52

హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి రేషన్ షాపులు మూతపడబోతున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వచ్చే నెల నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను స్థంభింప చేయాలని రాష్టవ్య్రాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు నిర్ణయించారు. దీంతో వచ్చే నెల జూలై నుంచి రాష్టవ్య్రాప్తంగా 17200 రేషన్ షాపులు మూతపడనున్నాయి. దీంతో 2.75 కోట్ల మందికి నిత్యవసర సరుకులు నిలిచిపోనున్నాయి.

06/09/2018 - 04:54

హైదరాబాద్, జూన్ 8: శాసన సభ్యత్వాల రద్దుపై జాతీయస్థాయిలో పోరాటం చేయనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాల రద్దు- కోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్న ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ శాసన సభ పక్షం అత్యవసరంగా సమావేశమైంది.

Pages