S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/08/2018 - 13:33

విశాఖ: నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. మోదీని దేశ ప్రజలు ప్రధానిగా నిర్ణయించారని.. చంద్రబాబును ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడూ ఎవరూ నిర్ణయించలేదని సోము వీర్రాజు అన్నారు.

06/08/2018 - 13:32

అమరావతి:‘మహా సంకల్పం’ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు రోజుల పాటు దీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని చివరి రోజు మరింత స్ఫూర్తివంతంగా చేయాలని అన్నారు. మన శక్తి, స్థాయి ‘మహాసంకల్పం’లో ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. ప్రతినెలా ఇదేరోజు ‘మహా సంకల్పం’ పురోగతిని సమీక్షించాలని అన్నారు.

06/08/2018 - 13:00

సిరిసిల్ల: సిరిసిల్ల బైపాస్ రోడ్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ - ద్విచక్రవాహనంను ఢీకొట్టి, అనంతరం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా వృద్దురాలు తీవ్రంగా గాయపడింది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

06/08/2018 - 12:50

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం ముందు శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న కారు పార్కింగ్‌ ప్రాంతంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బ్యాటరీలో లోపం వల్ల షాట్‌ సర్క్యూట్‌ జరిగినట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ డీఎస్పీ అంకయ్యా కారుగా అధికారులు గుర్తించారు.

06/08/2018 - 12:45

హైదరాబాద్‌ : ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేపమందు పంపిణీని మొదలుపెట్టారు. మందు పంపిణీ కోసం 1.60 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

06/08/2018 - 12:40

హైదరాబాద్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ నేతలతో తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆర్టీసీకి సుమారు రూ.3వేల కోట్ల అప్పు ఉందని.. దానికి ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ కడుతున్నామని మంత్రి తెలిపారు. కార్మికులు తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దిగడం సరికాదని మంత్రి కోరారు.

06/08/2018 - 02:56

కోదాడ, జూన్ 7: నరేంద్రమోదీ, కేసీఆర్‌ల మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ కౌసర్ మసీద్‌లో గురువారం రాత్రి కాంగ్రెస్ నాయకులు యంయే జబ్బార్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు.

06/08/2018 - 02:55

జగిత్యాల, జూన్ 7: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూ రికార్డుల శుద్ధీకరణలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం అధికార యంత్రాంగం గ్రామాల బాట పట్టింది. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి ఎక్సలెన్సీ అవార్డులు తీసుకున్న జిల్లా అధికార యంత్రాంగం మరింత ప్రతిష్టాత్మకంగా తప్పొప్పులకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

06/08/2018 - 02:53

హైదరాబాద్, జూన్ 7: దేశంలో కార్పొరేట్ అనుకూల పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుంభవన్‌లో ఏర్పాటు చేసన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

06/08/2018 - 02:36

హైదరాబాద్, జూన్ 7: టీటీడీ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. సుమారు గంటకుపైగా జగన్మోహనరెడ్డితో పలు విషయాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు జగన్‌తో దీక్షితులు భేటీ అయ్యారు. అనంతరం రమణ దీక్షితులు విలేఖరులతో మాట్లాడుతూ మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను...

Pages