S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/21/2018 - 02:06

తిరుపతి, మే 20: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని ఆభరణాల భద్రతకు భయం లేదని, స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో కొరత లేదని, వైఖానస ఆగమోక్తంగానే శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు జరుగుతున్నాయని టీటీడీ ఇఓ అనిల్‌కుమార్ సింఘాల అన్నారు. ఆలయంలో తవ్వకాల మాట అవాస్తవమన్నారు. విరిగిపోయిన కెంపు ధర 50 రూపాయలుగా నాటి రిజిస్టర్‌లో నమోదైందని పేర్కొన్నారు.

05/21/2018 - 00:35

ఇచ్ఛాపురం, మే 20: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఆఖరి అస్త్రంగా ఆమరణ దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్రను ఆదివారం ఇచ్చాపురం నుంచి శ్రీకారం చుట్టిన ఆయన ఉదయం కవిటి మండలం కపాసుకుద్దిలో గంగమ్మపూజ చేశారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో నిరసన కవాతు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

05/21/2018 - 00:32

విజయవాడ, మే 20: రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితి రానురాను దయనీయంగా మారుతుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతభత్యాలు, కంటింజెంట్, ఇతరత్రా బిల్లుల చెల్లింపులకు సంబంధించి లక్ష కోట్ల రూపాయలతో కూడిన బడ్జెట్‌ను దేశంలోనే తొలిసారిగా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్)పేరిట రాష్ట్ర ప్రభుత్వం జపాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ‘శాప్’కు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా

05/21/2018 - 01:01

విజయవాడ, మే 20: సుస్థిర అభివృద్ధికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే అంశంపై ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్‌ను ఆదేశించారు.

05/21/2018 - 00:23

భద్రాచలం టౌన్, మే 20: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఇటీవలి కాలంలో వరుస ఎదురుదెబ్బలతో డీలాపడిన మావోయిస్టులు అదును చూసి భీకర దాడికి పాల్పడ్డారు. పోలీసు జవాన్లను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

05/20/2018 - 04:31

ఖమ్మం(గాంధీచౌక్): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆకాంక్షలు నెరవేరడం లేదని, అందుకే జూన్ 1వ తేదీన తెలంగాణ కళాకారులు, ఉద్యమకారుల ఆధ్వర్యంలో అమరవీరుల ఆకాంక్ష దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో ధూంధాంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

05/20/2018 - 04:01

తిరుపతి, మే 19: వేసవి సెలవుల నేపథ్యంలో గత రెండు రోజులుగా శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో శనివారం భక్తుల సంఖ్య మరింత పెరిగింది. సాయంత్రం ఆరుగంటల వరకు 67,272 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 30 నుంచి 40 వేల మంది భక్తులు ఆదివారం ఉదయం లోపల స్వామివారిని దర్శించుకోడానికి వేచి ఉన్నారు.

05/20/2018 - 03:57

రెంటచింతల, మే 19: గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గ్రామస్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం నుండే ఎండలకు తోడు వెచ్చటి గాలులు వీస్తుండడంతో జనం బయటకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఉదయం ఎనిమిది గంటలకే తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు చెప్పడంతో జనం బెంబేలెత్తుతున్నారు.

05/20/2018 - 03:23

హైదరాబాద్, మే 19: ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండు దశల్లో కౌనె్సలింగ్‌ను ముగిస్తామని, ఇంకా సీట్లు మిగిలిపోతే ఆయా కాలేజీల్లోనే స్లయిడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. కాలేజీల్లో స్లయిడింగ్ చేసుకున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందని అన్నారు.

05/20/2018 - 03:19

హైనరాబాద్, మే 19 వచ్చే జనవరి 4వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు (పౌరులు) తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ సూచించారు. ఓటు నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టంగా చేపట్టాలని ఆయన తెలిపారు. కొత్త ఓటు నమోదుతో పాటు ప్రస్తుతం ఓటర్లలిస్టులో తప్పులను సిరిదిద్దాలని ఆయన ఆదేశించారు.

Pages