S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/20/2018 - 01:08

ఏలూరు, మే 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎటువంటి జాప్యం లేకుండా గిరిజన సలహామండలి (టీఏసీ)ని ఏర్పాటుచేస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఆర్ధికాభివృద్ధి సంస్ధను ఏర్పాటుచేసి కేవలం పావలా వడ్డీకే పూచీకత్తు లేకుండా రుణాలు పంపిణీ చేస్తామన్నారు.

05/20/2018 - 01:05

గుంటూరు, మే 19: సర్వహంగులతో ప్రతిష్ఠాత్మకమైన రీతిలో రాజధాని అమరావతిని నిర్మించే విషయంలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం 24 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

05/19/2018 - 17:32

అమరావతి:యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదిగి కర్నాటక ఎపిసోడ్‌పై మాట్లాడుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయటం సంతోషం కరిగించిందని అన్నారు. కర్నాటక అయిపోయి ఉంటే మనమీద పడేవారని ఆయన అన్నారు.

05/19/2018 - 13:40

తిరుమల: తిరుమలలో టీటీడీ అధికారులకు, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు మధ్య ఏర్పడిన వివాదంపై తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన పెద్ద జీయర్ శ్రీ శ్రీ పెద్ద జియ్యంగార్లు శఠగోప్పన్ రామానుజాచార్యులు శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర బద్దంగా సాగుతున్నాయి అని అన్నారు.

05/19/2018 - 13:29

హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2018 ఫలితాలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం విదితమే. ఈ ఏడాది రాష్ట్రంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 73,106 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 66,858 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 60,651(90.72 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

05/19/2018 - 04:05

హైదరాబాద్: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాలను ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం 18వ తేదీనే విడుదల చేయాల్సి ఉన్నా ఫలితాల నిర్వహణ బాధ్యతను తీసుకున్న ఏజన్సీ జాప్యంతో ఒక రోజు వాయిదా వేసినట్టు తెలిసింది. 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఎమ్సెట్ పరీక్షను నిర్వహించారు.

05/19/2018 - 04:03

హైదరాబాద్, మే 18: వేసవి తాపాన్ని తట్టుకోలేక తెగ సతమతం అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. ఈ ఏడు ఎండలకు ముందుగానే బ్రేక్ పడనుందని మండువేసవిలో చల్లటి వార్తను అందించింది. గతంలో కంటే కాస్త ముందుగానే దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని, 29న కేరళకు చేరుకొని జూన్ 1 నుంచి తొలకరి వర్షాలు మొదలు అవుతాయని వివరించింది.

05/19/2018 - 03:58

హైదరాబాద్, మే 18: ఇండోర్-లింగంపల్లి (హైదరాబాద్) మధ్య కొత్త రైలు హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ నెల 26 నుంచి రైలును ప్రారంభించేందుకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఎసి 3 టైర్‌తో బోగీలతో కూడి వారానికి ఒకసారి నడిచే విధంగా ఈ రైలును రెగ్యులర్ సర్వీస్‌గా ప్రారంభించబోతున్నారు.

05/19/2018 - 03:55

తిరుపతి, మే 18: తిరుమల శ్రీవారి ఆలయంలో 40 తరాలుగా మిరాశీ వంశీకులు అర్చకత్వం చేస్తున్నామని, అయితే పదవీ విరమణ ప్రకటన ఒకవైపు బాధకరమైనా, మరో వైపు సంతోషమని నూతనంగా ప్రధాన అర్చకులుగా నియమితులైన వేణుగోపాల్ దీక్షితులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టీటీడీ పాలకమండలిలో తీర్మానించిన మేరకు వయోపరిమితి నిబంధనలను స్వాగతిస్తున్నామన్నారు.

05/19/2018 - 03:53

పాడేరు/సీలేరు, మే 18: విశాఖపట్నం జిల్లా, పాడేరు సమీపంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ మృతి చెందగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారు. ఏవోబీలో గురువారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు జరగడం, మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకోవడం పాఠకులకు తెలిసిందే.

Pages