S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/21/2018 - 04:14

హైదరాబాద్, మే 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంద వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

05/21/2018 - 02:00

యాదగిరిగుట్ట, మే 20: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులతో యాదాద్రి కొండ ఆదివారం పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం, ప్రసాద విక్రయ కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

05/21/2018 - 01:58

తిరుపతి, మే 20: ఆగమ శాస్త్రాలు అనుమతిస్తే మూలవిరాట్టుకు జరిగే సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని టీటీడీ ఈఓ ఏకే సింఘాల్ అన్నారు.

05/21/2018 - 01:55

హైదరాబాద్, మే 20: తిరుమలలో జరుగుతున్న తప్పిదాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సంబంధించిన విలువైన ఆభరణాలు మాయం కావడం, మైసూరు రాజులు గతంలో స్వామికి సమర్పించిన వజ్రం మాయం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

05/21/2018 - 01:54

విజయవాడ, మే 20: గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నాలుగేళ్ల ఆర్చర్ మారుతీ ఆరుష్‌రెడ్డి ప్రపంచంలోనే అరుదైన రికార్డులు సృష్టించారు. పది నెలలుగా విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఈ చిన్నారి శిక్షణ పొందుతున్నాడు. వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఆదివారం కేవలం 14 నిముషాల 40 సెకన్ల వ్యవధిలో 15 మీటర్ల దూరంలోని 122 సెం.మీ టార్గెట్ ఫేస్‌ను 118 బాణాలతో ఆరుష్‌రెడ్డి ఛేదించాడు.

05/21/2018 - 01:21

హైదరాబాద్, మే 20: నానాటికి కాలుష్య కాసారంగా మారడంతో పాటు నీటి లభ్యత కరువు అవుతున్న కృష్ణానదికి పునర్జీనం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచ వాటర్ కౌన్సిల్ సహాయంతో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ, నదుల సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలు, ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌తో కలిసి పదేళ్ల పాటు పునఃర్జీవన పనులు చేపట్టాలని నిర్ణయించింది.

05/21/2018 - 00:54

హైదరాబాద్, మే 20: ఆర్టీసీలో కార్మిక సమ్మెపై సందిగ్ధత కొనసాగుతోంది. గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ఇచ్చిన సమ్మె నోటీసును సర్కారు ఖాతరు చేయకపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆలోచనలు సాగుతున్నాయ. సమ్మె చేసుకుంటే చేసుకోవచ్చంటూ సీఎం కేసీఆరే నిర్ద్వంద్వంగా తెగేసి చెప్పడంతో, తెలంగాణ మజ్దూర్ సంఘం (టీఎంయూ) ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చింది.

05/21/2018 - 00:53

హైదరాబాద్, మే 20: రానున్న ఎన్నికల ఏడాదిలో విద్యుత్ వ్యవహారం ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. సరఫరాపై సర్కారు లెక్కలకు, ట్రాన్స్‌కో వివరాలకు పొంతన కుదరకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా వచ్చే జనవరికి విద్యుత్‌పై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.

05/21/2018 - 00:51

హైదరాబాద్, మే 20: తెలంగాణలో 2018 ఖరీఫ్ సీజన్‌కు విత్తన సంక్షోభం తప్పేలా లేదు. గత నాలుగేళ్లుగా ఖరీఫ్ సీజన్‌లో సరాసరిన కోటి ఎకరాల్లో రైతులు విత్తనాలు వేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 1.42 కోట్ల ఎకరాల్లో పంటలు వేసేందుకు ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద ఆర్థిక సాయం అందించింది. అంటే ఇంత విస్తీర్ణంలో పంటలు వేసేందుకు విత్తనాలు సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది.

05/21/2018 - 00:50

హైదరాబాద్, మే 20: ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్యలు వేగవంతమయ్యాయ. నెలాఖరున బదిలీలపై నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల బదిలీలకు శాశ్వత విధానాన్ని రూపొందిస్తోంది.

Pages