S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/17/2018 - 03:40

తిరుపతి, మే 16: కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి కొలువులో అర్చకులుగా పనిచేస్తూ 65 సంవత్సరాలు పైబడిన వారికి విశ్రాంతి ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలకమండలి తొలి సమావేశం బుధవారం పుట్టాసుధాకర్ యాదవ్ అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది.

05/17/2018 - 03:42

హైదరాబాద్, మే 16: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ కమిషన్‌ను రెండు, మూడు రోజుల్లో ప్రకటించనున్నట్టు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గతంలో మాదిరిగా వేతన సవరణ కమిషన్‌కు ఏక సభ్యునితో కాకుండా ఈసారి త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15నాటికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశిస్తామన్నారు.

05/17/2018 - 02:18

ఇల్లంతకుంట, మే 16: ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ సభలో నిరుపేద దళిత కూలీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనమైంది. భూ పంపిణీలో అన్యాయం తనకు జరుగుతుందని, మూడెకరాల భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఒగులాపూర్‌కు చెందిన ఇల్లందుల కిష్టయ్య మంత్రి సభలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కిష్టయ్యను అధికారులు పీహెచ్‌సీకి తరలించారు.

05/17/2018 - 03:44

ఇల్లంతకుంట, మే 16: ‘రైతుబంధు’ పథకంతో యావత్ దేశం చూపు తెలంగాణ వైపుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కే. తారకరామారావు అన్నారు. బుధవారం సిరిసిల్ల రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయం పెట్టుబడికి డబ్బులు అందించి రైతులకు ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు.

05/17/2018 - 03:46

* గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపాటు ** సుప్రీంకోర్టు సీజేను ఆశ్రయించిన వైనం
* ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ వినతి

05/17/2018 - 03:48

విజయవాడ, మే 16: ఉపాధి లక్ష్యంగా వివిధ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుకు వీలుగా ఎం-పార్క్ పాలసీ 2018-23ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటి పాలసీకి కూడా ఆమోద ముద్ర వేసింది. మున్సిపాలిటీలలో 12,600 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలనామోదాన్ని తెలిపింది.

05/17/2018 - 03:51

ఏలూరు/ రాజమహేంద్రవరం, మే 16: గోదావరి లాంచీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల వంతున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. మంగళవారం సంభవించిన లాంచీ ప్రమాదం అత్యంత ఘోరమైనదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి వద్ద ప్రమాదం జరిగిన లాంచీనుంచి మృతదేహాల వెలికితీత, ఇతర సహాయక పునరావాస కార్యక్రమాలను బుధవారం స్వయంగా పరిశీలించారు.

05/17/2018 - 01:48

న్యూఢిల్లీ, మే 16: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 902.07 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ వర్శిటీ, ఈ ఏడాదినుంచే తాత్కాలిక వసతుల్లో పనిచేయటం ప్రారంభిస్తుందని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

05/17/2018 - 01:44

కర్నూలు, మే 16: తిరుమలలో వెంకన్న దర్శనానికి ఆర్టీసీ, టీటీడీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ టికెట్లతోపాటు ప్రత్యేక దర్శనం టికెట్లు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కలిగింది. భక్తులు ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, ఆర్టీసీ ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చు. ఒప్పందం ప్రకారం ప్రతి రోజూ వెయ్యి ప్రత్యేక దర్శనం టికెట్లు కేటాయిస్తారు.

05/17/2018 - 01:29

హైదరాబాద్, మే 16: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు గురువారం (17న) ప్రారంభంకానున్నాయి. బుధవారం సాయంత్రం చంద్ర దర్శనం కావడంతో గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని హైదరాబాద్‌లోని రుయత్ హిలాల్ కమిటీ ప్రకటించింది. నెల రోజుల పాటు ముస్లిం ఉపవాస దీక్షలు చేస్తారు.

Pages