S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/16/2018 - 00:50

శ్రీకాకుళం, మే 15: స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్‌వారి పంచన చేరి భారతదేశానికే ద్రోహం చేసిన ద్రోహుల జాబితాల్లో ఇప్పుడు జగన్ చేరారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తులు కేసులు మాఫీ కోసం బీజేపీతో చేతులుకలిపి ఐదు కోట్లు ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

05/16/2018 - 00:47

విజయవాడ, మే 15: కర్నాటక రాష్ట్రంలో అనూహ్య పరిణామాలతో భారతీయ జనతాపార్టీ విజయపథంవైపు దూసుకెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక హోదా ఉద్యమ పక్షాల్లో ఒక్కసారిగా నీరసం ఆవహించింది. ఇదే సమయంలో కమలనాథుల్లో ఉత్సాహం నెలకొంది. ఊరూ వాడా బాణాసంచా కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

05/15/2018 - 16:50

హైదరాబాద్‌ : తెలంగాణ కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా మోదీ పాలనకు ఉన్న ప్రజామోదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు.‘కర్ణాటక ఫలితాలు చూసైనా కుటుంబ పాలకులు కనువిప్పాలని, ఎందుకంటే మరో 20 ఏళ్లపాటు దేశానికి మోదీపాలన అవసరమని ప్రజలు భావిస్తున్నారు.

05/15/2018 - 14:07

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీనటి కిర్తీసురేష్‌, పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

05/15/2018 - 14:05

శ్రీకాళహస్తి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్‌కు తీర్ధప్రసాదాలు అందజేశారు.

05/15/2018 - 02:16

హైదరాబాద్, మే 14: అంతర్జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థులు బంగారు పతకాలు సాధించడంపై సంబంధిత శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కరాటే, మల్లయుద్ధం వంటి క్రీడల్లో మన విద్యార్థులు సత్తా చాటారు. ఈనెల 10,11 తేదీల్లో దుబాయ్‌లో అంతర్జాతీయ క్రీడలు జరిగాయి. దాదాపు 49 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణాలో గ్రామీణ ప్రాంత గిరిజనులు అంతర్జాతీయ క్రీడల్లో అడుగుపెట్టారు.

05/15/2018 - 01:49

విశాఖపట్నం, మే 14: పశ్చిమబెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఉండగా, తెలంగాణ నుంచి తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం సోమవారం రాత్రి పేర్కొంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో ఒకటి, రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్రం వివరించింది.

05/15/2018 - 00:43

హైదరాబాద్, మే 14: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బస్సు యాత్ర చేపట్టిన టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరోవైపు నీటి పారుదల ప్రాజెక్టుల వైపు దృష్టి మరల్చారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాలని ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తుమ్మడిహెట్టి-ప్రాణహిత ప్రాజెక్టును సందర్శించనున్నారు.

05/15/2018 - 00:42

హైదరాబాద్, మే 14: తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహణ, చికిత్స, అవసరం మేరకు అద్దాలు సమకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం 106.83 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణ ప్రజలను అంధత్వం నుండి కాపాడేందుకు వీలుగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కంటికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకూ ఈ పథకం కింద చికిత్స చేస్తారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు.

05/15/2018 - 00:40

హైదరాబాద్, మే 14: తెలంగాణలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో సాగయ్యే భూమి విస్తీర్ణం ఎంత? అన్న ప్రశ్నకు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 110 లక్షల ఎకరాలకు మించదని స్పష్టమవుతోంది. 2014 నుండి 2017 వరకు వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్‌లో ప్రతివారం ‘సీజనల్ కండిషన్’ పేరుతో నివేదికలను విడుదల చేస్తూ వస్తోంది. జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ అక్టోబర్ వరకు కొనసాగుతుంది.

Pages