S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/13/2018 - 02:15

విశాఖపట్నం, మే 12: విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ విస్తరించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఈనెల 15నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండకపోవచ్చు.

05/13/2018 - 02:06

దేవీపట్నం, మే 12: పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లు, లాంచీలను ఆదివారం నుంచి తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ బోట్స్ సూపరింటెండెంట్ బి రత్నరాజు తెలిపారు. శుక్రవారంనాటి సంఘటన పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

05/13/2018 - 04:20

భద్రాచలం టౌన్, మే 12: ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే జల ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ఉత్సాహమే కొందరి తప్పిదాల వల్ల నీరుగారిపోతోంది. నిబంధనలను నిర్లక్ష్యం చేయడం.. అడుగడుగునా అభద్రత నెలకొనడంతో పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది.

05/13/2018 - 01:58

* 22న వెంకయ్యనాయుడి రాకపై కమలనాథుల్లో మిశ్రమ స్పందన

05/12/2018 - 17:22

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. జూన్ 29న ఎన్నిక, ఈ నెల 17 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ 52 వేల మందికి ఓటు హక్కు ఉంది. తెలంగాణలో 23 వేల మంది, ఏపీలో 29 వేల మంది ఓటర్లు ఉన్నారు.

05/12/2018 - 17:13

కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్లు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి అనసూయ(85), కుమార్తె విజయ(55) ఈ దారుణానికి పాల్పడ్డారు. కారణాలు తెలియరాలేదు.

05/12/2018 - 17:13

రాజమండ్రి: పాసర్లపూడి వద్ద గోదావరిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. శివ(21), ముత్యాల నాగసుజిత(15) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటంతో సూసైడ్ నోట్ రాసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

05/12/2018 - 15:46

గన్నవరం: వీఐపీల రాకపోకలతో పాటు భద్రతా కారణాల రీత్యా గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధిస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు నుంచి 55 రోజుల పాటు అంటే.. జూలై 4 తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

05/12/2018 - 14:03

విజయవాడ: ఏపీ ఐసెట్-2018 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. జూన్‌ 20 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు.

05/12/2018 - 13:46

గుంటూరు: దాచేపల్లిలో మరో ఘోర అకృత్యం వెలుగు చూసింది. బాలికపై ఓ ఎంపీటీసీ భర్త అత్యాచారానికి తెగబడ్డాడు. గత కొంతకాలంగా బాలికను బెదిరించి మాబువలీ అనే వ్యక్తి అత్యాచారానికి పూనుకున్నాడు. విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ బాలిక స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించడంతో దుర్మార్గుడి దురాగతం బయటపడింది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతిగా వైద్యులు నిర్థారించారు.

Pages