S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/04/2018 - 13:53

గుంటూరు: దాచేపల్లి ఘటనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా గుంటూరు జీజీహెచ్‌ దగ్గర ఆందోళన చేశారు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. నిందితుడు సుబ్బయ్యను కఠినంగా శిక్షించినప్పుడే బాధితురాలికి సరైన న్యాయం దక్కినట్లు అవుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

05/04/2018 - 13:55

దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 15 పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయితే నిందితుడు రామసుబ్బయ్యకు బంధువులు ఫోన్ చేస్తే తాను చనిపోతున్నానంటూ బదులిచ్చాడు.

05/04/2018 - 12:23

హైదరాబాద్ : క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు శుక్రవారం మధ్యాహ్నం కూడా కురిసే అవకాశం ఉన్నదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర విదర్భ నుంచి ఒడిశా పరిసర ప్రాంతాల వరకు విస్తరించిన ఆవర్తనం కొనసాగుతున్నదన్నారు.

05/04/2018 - 12:08

మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన డ్రైవర్ రాజు(24), సత్తెవ్వ(35), శ్రావణ్(12), శాలిని(12)గా గుర్తించారు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

05/04/2018 - 03:51

రావులపాలెం, మే 3: అననుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో గురువారం ఉదయం ఒక హెలికాఫ్టర్‌ను పైలట్ అత్యవసరంగా పంట చేల నడుమ ల్యాండింగ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.

05/04/2018 - 02:31

తిరుపతి, మే 3: దేశంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ అయిన టీటీడీకి పాలక మండలి చైర్మన్‌గా దళితుడిని నియమించాలని టెంపుల్స్ ప్రొటక్షన్ మూమెంట్ కన్వీనర్ సౌందరరాజన్ అన్నారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రం చిలుకూరులో బాలాజీ ఆలయంలో ముని వాహనోత్సవం అనుభవాలను మీడియాకు వివరించారు.

05/04/2018 - 02:30

విజయవాడ, మే 3: గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని సహించబోమని, పరారీలో ఉన్న నిందితుడిని పట్టి ఇచ్చిన వారికి పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

05/04/2018 - 03:14

హైదరాబాద్, మే 3: ఈదురుగాలులు, వడగళ్లవాన, పిడుగుపాట్లతో తెలంగాణ రాష్ట్రం గురువారం దద్దరిల్లిపోయింది. పిడుగుపాటు తదితర కారణాల వల్ల వివిధ జిల్లాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. సెనగ, మిర్చి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం ఎంత జరిగిందో తెలుసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.

05/04/2018 - 03:17

హైదరాబాద్, మే 3: రైతుబంధు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏర్పాట్ల కోసం జిల్లాకు రెండు కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి తెలిపారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.

05/04/2018 - 02:06

హైదరాబాద్, మే 3: ఉద్యోగుల డిమాండ్లపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగులతో చర్చించడానికి ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం నియమించారు. ఈ కమిటీ శుక్రవారం సాయంత్రం రెండు గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది.

Pages