S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/04/2018 - 02:04

హైదరాబాద్, మే 3: కేంద్రం సహకరించడం లేదని రాష్ట్రప్రభుత్వం పదే పదే చెప్పడం సాకు మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడి పడికాపులు కాసేవారని, అదే మోదీ పాలనలో రైతులు విరివిగా ఎరువులు పొందుతున్నారని అన్నారు.

05/04/2018 - 02:03

హైదరాబాద్, మే 3: వేసవిలో తరగతులు నిర్వహిస్తే ఊరుకునేది లేదని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ అందుకు అనుగుణంగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. గత పక్షం రోజుల్లో 560 కాలేజీలకు షోకాజ్‌లు ఇవ్వడమేగాక, తరగతులు నిర్వహిస్తున్నందుకు ఆయా కాలేజీలకు సీళ్లు వేయించారు.

05/04/2018 - 03:19

విజయవాడ, మే 3: రాజధాని అమరావతిలో వౌలిక సదుపాయాల పనులను, చేపట్టిన వివిధ ప్రాజెక్టులను నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇది చాలా కీలకమైన సమయమని, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేయకుంటే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

05/04/2018 - 03:21

విజయవాడ, మే 3: పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సులతో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఏడున 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు, ఆర్థిక నిపుణులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

05/04/2018 - 03:23

రాజమహేంద్రవరం, మే 3: గోదావరి జిల్లాల రైతాంగాన్ని నీటి గండం వెంటాడుతోంది. దాళ్వా సాగు పూర్తయ్యేవరకు నీటి గండం వెంటాడగా, పంట చేతికొచ్చే ప్రస్తుత తరుణంలో భారీ వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గోదావరిలో సహజ నీటి లభ్యత దారుణంగా పడిపోవడంతో దాళ్వాలో అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఎదురై సంగతి విదితమే.

05/04/2018 - 03:24

దాచేపల్లి, మే 3: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బుధవారం రాత్రి ఎనిమిది సంవత్సరాల బాలికపై అన్నం సుబ్బయ్య అనే 50 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

05/04/2018 - 01:41

విజయవాడ, మే 3: రాష్ట్రంలోని వివిధ బి.ఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ను శ్రీవెంకటేశ్వర వర్సిటీ నిర్వహించింది. ఆన్‌లైన్‌లో గత నెల 19న పరీక్ష నిర్వహించారు. 8697 మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, 7679 మంది హాజరయ్యారు.

05/03/2018 - 16:33

అమరావతి: భారీ వర్షంతో ఏపీ సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు చేరింది. భవనాలు పూర్తిగా తడిసిపోవడంతో అక్కడక్కడ సీలింగ్‌ ఊడిపోయి నీరు కార్యాలయంలోకి ప్రవేశించింది. మున్సిపల్‌ మంత్రి నారాయణ ఛాంబర్‌లో సీలింగ్‌ ఎగిరిపోవడంతో సిబ్బంది ఛాంబర్‌ తలుపులు మూశారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఛాంబర్‌ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

05/03/2018 - 16:34

విశాఖ: మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు పడుతోన్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో భారీగా ఈదురుగాలు వీస్తుండటంతో పిడుగులు పడే ‍ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

05/03/2018 - 16:36

దాచేపల్లి (గుంటూరు): అత్యాచారానికి గురైన బాలికను జిల్లాకలెక్టర్ కోనె శశిధర్ , ఎమ్మెల్యే ముస్తఫా, ప్రజా మహిళా సంఘాల నేతలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. ఈ ఘటనపై హోంమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. గుంటూరు రూరల్ ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Pages