S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/29/2018 - 05:05

హైదరాబాద్: సీబీఎస్‌ఈ లీకైన పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు బోర్డు బుధవారం ప్రకటించింది. ప్లస్ టు పేపర్లు , పదో తరగతి పేపర్లు లీకైనట్టు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నా తొలుత బుకాయించిన సీబీఎస్‌ఈ అధికారులు, ఎట్టకేలకు లీకేజీని అంగీకరించారు. దాంతో ప్లస్ ఎకనామిక్స్, పదో తరగతి మాథ్స్ పేపర్లను తిరిగి నిర్వహించనున్నట్టు బోర్డు కంట్రోలర్ బుధవారం ఢిల్లీలో ప్రకటించారు.

03/29/2018 - 03:44

గుంటూరు, మార్చి 28: రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రప్రభుత్వం ఎందుకింత వివక్షత ప్రదర్శిస్తోందో ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నా, గత కొద్దిరోజులుగా పార్లమెంటులో ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ అవిశ్వాసం ప్రకటించినా వాయిదాలతో ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని ప్రశ్నించారు.

03/29/2018 - 01:39

* ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ వెల్లడి

03/29/2018 - 02:10

సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగం
రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్

03/28/2018 - 17:31

తిరుమల:తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ పోటులో బుధవారంనాడు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోనికి తెచ్చాయి.

03/28/2018 - 17:29

హైదరాబాద్: శంషాబాద్ పసిపిల్లల విక్రయించే ముఠా గుట్టురట్టయింది. స్థానికలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. పిల్లలను విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 12 మంది పిల్లలను విక్రయించినట్లు వెల్లడయిందన పోలీసులు తెలిపారు.

03/28/2018 - 17:27

అమరావతి: కేంద్రం ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. సంక్షేమ పథకాలను సైతం ఆపబోమని చెప్పారు. కేంద్రాన్ని గొంతెమ్మ కోర్కెలు అడగటం లేదని అన్నారు. ఈసారి మంత్రుల బృందంతో మూడు పార్టీలకు ఆహ్వానం పంపుతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల తప్పని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

03/28/2018 - 14:03

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

03/28/2018 - 13:54

హైదరాబాద్: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్‌బాగ్ కూడలి నుంచి ర్యాలీగా వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌ఓ, టీవీవీ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

03/28/2018 - 13:44

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సచివాలయ ఉద్యగులూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Pages