S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/27/2018 - 02:55

నల్లగొండ, ఫిబ్రవరి 26: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పదవ రోజు సోమవారం మహాపూర్ణాహుతి, సుదర్శన చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు శాస్తయ్రుక్తంగా అర్చక, యాజ్ఞక బృందం ఘనంగా నిర్వహించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల వీక్షణకు గరుడుడి ఆహ్వానంతో యాదాద్రికి విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ వారిని తృప్తిపరిచేలా ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహించారు.

02/27/2018 - 02:52

తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడు
తెప్పలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్న జియ్యర్, ఈఓ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

02/27/2018 - 03:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంనుంచి నిధులు సరిగా రావడం లేదనేది కేవలం అపోహ మాత్రమేనని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో మాణిక్యాలరావు భేటీ అయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తగిన కేటాయింపులు జరపలేదనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అన్నారు.

02/27/2018 - 02:06

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మక పవర్‌హౌస్ నిర్మాణం నవయుగ సంస్థకు దక్కింది. మిగిలి పోయిన (బ్యాలెన్స్) మట్టి పనిని కూడా నవయుగ సంస్థకే ప్రభుత్వం అప్పగించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సులో భాగంగా మిగిలిపోయిన మట్టిపని విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

02/27/2018 - 01:48

హైదరాబాద్, ఫిబ్రవరి 26: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒకఎత్తు. కాంగ్రెస్ సారధ్యంలోని తెరాస వ్యతిరేక పార్టీలన్నీ ఒకఎత్తని తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా పిలుపునిచ్చారు. తెలంగాణ పరిస్థితిని చూసి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్నిస్తే, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాయమాటలతో కుటుంబ పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు.

02/27/2018 - 02:15

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలంటే ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సిఆర్ చౌదరి పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో ఈ-పరిపాలనపై జాతీయ సదస్సు ప్రారంభించారు.

02/27/2018 - 01:43

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష షెడ్యూలును నిర్వాహక వర్శిటీ జేఎన్‌టియూహెచ్ సోమవారం ప్రకటించింది.

02/27/2018 - 01:41

కరీంనగర్, ఫిబ్రవరి 26: రైతు బతుకుకు రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా ప్రకటించారు. ఒడిదొడుకులు, ఆటుపోట్లతో అతలాకుతలం అవుతున్న అన్నదాతకు కేసీఆర్ తీపి కబురు అందించారు. రైతులకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని ప్రకటించారు. రైతులు అనారోగ్యం పాలైన, ఆకాల మరణం పొందినా రూ.5 లక్షల బీమా కల్పిస్తామని, భీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు.

02/27/2018 - 01:33

ఒంగోలు, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు అంతులేని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. లేనివి ఉన్నట్లుగా చంద్రబాబు ప్రజలకు దొంగలెక్కలు చెబుతున్నారని ఆక్షేపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గంలో పర్యటిస్తున్న జగన్ సోమవారం మధ్యాహ్నం పొదిలి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

02/27/2018 - 01:31

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఆంధ్రలో పెట్టుబడులకు సంకోచం అవసరం లేదని, మీ పెట్టుబడులకు నాదీ హామీ అని పారిశ్రామికవేత్తలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ భరోసానిచ్చారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా నరసింహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే, తమ డబ్బు ఏమవుతుందోనని చాలా మంది భయపడతారు కానీ మిషన్.. విజన్..

Pages