S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/27/2018 - 01:29

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటాను 80 శాతానికి పెంచుతామని సీఎం చంద్ర బాబు అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు చివరి రోజు సోమవారం ఏపీ ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రోత్సహంపై ప్రత్యక్ష సదస్సు జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటా ప్రస్తుతం 20 శాతంమేర ఉందని, దీన్ని రానున్న కాలం లో 80 శాతానికి పెంచుతామన్నారు.

02/27/2018 - 01:27

కాకినాడ, ఫిబ్రవరి 26: ఏపీ ఎమ్సెట్‌ను ఏప్రిల్ 22నుంచి నిర్వహిస్తున్నామని కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు వెల్లడించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏపీ ఎమ్సెట్ -2018 పరీక్ష నిర్వహణను కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) వరుసగా నాల్గవసారీ కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) పద్ధతిలో నిర్వహిస్తోందన్నారు.

02/27/2018 - 01:25

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: విశాఖలో వరుసగా మూడోసారి మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సులో లక్ష్యానికి మించి పెట్టుబడులు రావడంతో సీఎం చంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. గతంలో జరిగిన భాగస్వామ్య సదస్సులకు భిన్నంగా సదస్సు జరిగింది.

02/26/2018 - 16:55

విశాఖపట్నం: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు మూడో రోజు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సులో పాల్గొన్నారు. కనెక్టివిటీ అండ్ కమ్యూనికేషన్ అంశంపై ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, సీఎం చంద్రబాబు సదస్సులో ప్రసంగిస్తున్నారు.

02/26/2018 - 16:40

కరీంనగర్ : రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ.. రైతులతో సీఎం ఏకగ్రీవ తీర్మానం చేయించారు.

02/26/2018 - 13:14

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం చేపల వ్యాన్ బోల్తా పడింది. మచిలీపట్నం నుంచి తిరుచ్చి వెళ్తున్న చేపల వ్యాన్ కోవూరు రిలయన్స్ పెట్రోలు బంకు వద్ద అదుపు తప్పింది. అందులోని ఉన్న రెండు టన్నుల చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వ్యాన్‌ సిబ్బంది రోడ్డుపై ఉన్న చేపలను వెంటనే తొలగించడంతో వాహనాలు రాకపోకలు కలగలేదు.

02/26/2018 - 16:42

సంగారెడ్డి: 60 ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తూనే ఉందని మంత్రి హరీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ దగాకోరు పార్టీ అని దుయ్యబట్టారు. పోలవరానికి జాతీయహోదా ఇచ్చి ప్రాణహిత-చేవెళ్లకు మొండిచేయి చూపారని ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్‌ నేతలు యాత్రలు చేస్తారని ఆయన అన్నారు.

02/26/2018 - 12:41

బాసర: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసర​కు భక్తులు పోటెత్తారు. సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చిన్నారులకు అధిక సంఖ్యలో అక్షరాభాస్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

02/26/2018 - 12:17

కరీంనగర్‌: గోదావరిఖని బైపాస్‌ రోడ్డులో హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ డ్రైవర్‌ కారులో డీజిల్‌ పోసుకుని యూటర్న్‌ తీసుకుంటుండగా లైన్‌మెన్‌ గోపాల్‌ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

02/26/2018 - 12:07

హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోచంపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు (ఏపీ 09 ఏకే 0060) ను లారీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ రామంతపురంకు చెందిన ఒకే కుటుంబసభ్యులు పద్మ, స్వప్న, మనికాంత్ గా గుర్తించారు.

Pages