S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/22/2018 - 17:46

బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అనూష అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని వెల్లడించింది. అనూష స్వస్థలం సిద్ధిపేట జిల్లా మందపల్లిగా గుర్తించారు.

09/22/2018 - 17:46

హైదరాబాద్: దేశంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాటిని మరిచిపోయి ఉండవచ్చని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ నిజాయితీ గురించి దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాహుల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కితాబులు అవసరం లేదని చెప్పారు.

09/22/2018 - 17:45

హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద కుంభకోణం రాఫెల్ విమానాల కొనుగోలులో జరిగిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో కుంభకోణం జరిగినట్లు వెల్లడైందని అన్నారు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజీనామా చేయాలని అన్నారు.

09/22/2018 - 13:29

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి న్యాయస్థానం మళ్లీ రిమాండ్‌ విధించింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జగ్గారెడ్డిని జైలుకు తరలించారు. నేటితో రిమాండ్‌ గడువు ముగియడంతో జగ్గారెడ్డిని తిరిగి న్యాయస్థానంలో హాజరు పర్చగా తిరిగి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

09/22/2018 - 06:32

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో టీఆర్‌ఎస్ పాత్ర లేకుంటే గులాంనబీ ఆజాద్ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటికి ఎందుకువచ్చారని ఎంపీ బి వినోద్‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఆజాద్ వ్యాఖ్యలకు తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

09/22/2018 - 06:30

సిద్దిపేట, సెప్టెంబర్ 21 : సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకగ్రీవ తీర్మాన సభలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగభరితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి హరీష్‌రావుకు గ్రామస్థులు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికారు.

09/22/2018 - 05:42

భిక్కనూరు, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకులను చూసి చలించి పోయిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారనీ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురి కోసం కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు.

09/22/2018 - 05:44

సిద్దిపేట, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని.. కేసీఆర్ ఆమరణ దీక్ష.. ప్రజలు పోరాటంతో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటేనే..

09/22/2018 - 05:24

చింతపల్లి, సెప్టెంబర్ 21: తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు వారి అభీష్టం మేరకు దేవరకొండ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై కొట్టి ఈ నెల 26న కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ ప్రకటించారు.

09/22/2018 - 05:23

కరీంనగర్, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం వేకువఝాము నుంచి రాత్రి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరు నుంచి ఓ మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సామాన్య జనజీవనం కొంతమేర స్తంభించింది.

Pages