S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/18/2019 - 23:58

హైదరాబాద్, జనవరి 18: అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావుతో సెల్ఫీ దిగేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం కేటీఆర్ సభ నుంచి ఆవరణలోని టీఆర్‌ఎస్-ఎల్‌పీ కార్యాలయానికి వెళుతుండగా, అక్కడ ఉన్న సందర్శకులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

01/18/2019 - 23:58

రాజమహేంద్రవరం, జనవరి 18: ఫిబ్రవరిలో నిర్వహించనున్న మాదిగల విశ్వరూప మహాసభ నాటికి ఏపీలో పార్టీల నిజ స్వరూపం తేలనుందని, మాదిగల పట్ల పార్టీల కుట్రపూరిత వ్యవహారం బయటపడుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. విభజన అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల ఉనికిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

01/18/2019 - 23:57

హైదరాబాద్, జనవరి 18: గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. మంత్రివర్గ సమావేశం లేకుండా అసెంబ్లీలో పాసైన పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్‌లో పేర్కొన్నారు.

01/18/2019 - 23:57

హైదరాబాద్, జనవరి 18: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ నెల 25 నుండి 27 వరకూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్టు పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం చెప్పారు. ఈసారి చైనా నుంచి ఆతిథ్య బృందం హాజరవుతుందని, 8 మంది రచయితలు, కళాకారులు, చర్చావేదికల్లో పాల్గొంటారని అన్నారు.

01/18/2019 - 23:56

హైదరాబాద్, జనవరి 18: ప్రజల్లో పట్టు, పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్టానంలో గుర్తింపు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెదవి విరిచారు. శాసనసభ లాబీల్లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, లాబీయింగ్‌లు చేసే వారికే అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని వాపోయారు. ప్రజల్లో పట్టున్న నేతలు రాహుల్‌గాంధీని కలువకుండా కోటరి అడ్డుపడుతోందన్నారు.

01/18/2019 - 23:51

హైదరాబాద్, జనవరి 18: వచ్చే ఐదేళ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.2.25 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

01/18/2019 - 23:51

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నాడు శాసనసభ సమావేశం కాగానే ప్రోటం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కరే ఆరు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని, దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిందని ప్రొటం స్పీకర్ ప్రకటించారు.

01/18/2019 - 23:48

హైదరాబాద్, జనవరి 18: అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

01/18/2019 - 23:46

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెండో శాసనసభ ఏర్పాటు కావడంతో పాటు సభ సమావేశాలు ప్రారంభం కావడంతో శనివారం నాడు శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి శాసనసభ ప్రాంగణంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. కొత్త సభ ప్రారంభం అయినపుడు, బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది.

01/18/2019 - 23:46

న్యూఢిల్లీ, జనవరి 18: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈమేరకు భట్టివిక్రమర్కను సీఎల్‌పీ నేతగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Pages