S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/24/2019 - 17:42

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే నిజామాబాద్ నుంచి ఓటమిపాలైన టీఆర్‌ఎస్ ఎంపీ, సీఎం కుమార్తె కవిత కూడా హరీష్‌తో పాటు సమావేశమయ్యారు.

05/24/2019 - 04:35

కరీంనగర్, మే 23: తెలంగాణ ఉద్యమ గుండెకాయ కరీంనగర్‌లో కమలం వికసించింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ఎదురుచూపులనంతరం మరోసారి జయకేతనం ఎగరవేసింది. కార్యకర్తలే లేరన్న చోట మేమున్నామంటూ ఓటర్లు అక్కున చేర్చుకుని ఆదరించగా రాష్ట్రంలోనే ఆ పార్టీకి అత్యధిక మెజారిటీ లభించగా, పురిటిగడ్డపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది.

05/24/2019 - 04:34

వరంగల్, మే 23: పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో వరంగల్ పార్లమెంటు స్ధానం మెజార్టీ మరో సారి రికార్డుకు ఎక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు దక్కింది.

05/24/2019 - 04:34

మెదక్, మే 23: మెదక్ లోక్‌సభకు ప్రజలు అత్యధిక మెజార్టీని తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. నర్సాపూర్ బీవీఆర్‌ఐటి కళాశాలలో జరిగిన కౌంటింగ్ కేంద్రంలోని మీడియా ఛాంబర్‌లో గురువారం సాయంత్రం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు.

05/24/2019 - 04:33

మహబూబ్‌నగర్, మే 23: పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో గులాబీ గుబాళించింది. గురువారం పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వెలువడడంతో రెండు పార్లమెంట్ స్థానాలు తెరాస ఖాతాలోకి వెళ్లాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ రెండు పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

05/24/2019 - 04:05

హైదరాబాద్, మే 23: తెలంగాణలో నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ గెలవడంతో పార్టీ శ్రేణులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కార్యాలయంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో మంచి విజయాలు, జాతీయ స్థాయిలో బంపర్ మెజారిటీ దక్కడంతో బీజేపీ నేతలు భారత్ మాతాకీ జై, బీజేపీ జిందాబాద్, మోదీ జిందాబాద్ నినాదాలు చేశారు.

05/24/2019 - 04:01

హైదరాబాద్, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి గుణపాఠం తగిలిందని సీపీఐ రాష్ట్ర కార్యిదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సారు-కారు-పదహారు అంటూ టీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం బెడిసికొట్టిందని అన్నారు.

05/24/2019 - 04:01

హైదరాబాద్, మే 23: ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్‌లో సంబురాలు నిర్వహించారు. లోటస్‌పాండ్ పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవాలు జరుపుకొన్నారు. జంట నగరాల్లో ఉన్న వైకాపా నేతలు, అభిమానులు ఇక్కడికి భారీగా తరలివచ్చారు. మిఠాయిలు పంచుతూ.. నృత్యాలు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ సంబురాల్లో పాల్గొన్నారు.

05/24/2019 - 04:07

టీఆర్‌ఎస్ -9, బీజేపీకి -4, కాంగ్రెస్-3, ఎంఐఎం-1
*

05/24/2019 - 03:55

హైదరాబాద్, మే 23:గురుకులాల ప్రతిష్టను అన్ని విధాల పెంచుతున్న కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను దూషించడం, నిందలు వేయడం సరికాదని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సోలపోగుల స్వాములు పేర్కొన్నారు.

Pages