S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2017 - 02:10

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ విషయాన్ని కోరుతున్నా మజ్లిస్‌ల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

07/21/2017 - 02:08

హైదరాబాద్, జూలై 20: సాధారణ పరిపాలనా శాఖ రూపొందించిన పోర్టల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ గురువారం ఆవిష్కరించారు. జిల్లాల్లో పని చేసే అధికారులు ఇక నుంచి సచివాలయానికి రాకుండానే పోర్టల్ ద్వారా సెలవులు, ఎల్‌టిసి వంటి వాటికి అనుమతులు పొందవచ్చని ఈ సందర్భంగా ఎస్‌పి సింగ్ అన్నారు.

07/21/2017 - 02:06

హైదరాబాద్, జూలై 20: భారత 14వ రాష్టప్రతిగా రామనాథ్ కోవింద్ ఎన్నికపై బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. రామనాథ్ కోవింద్ ఘన విజయం సాధించడంపై పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. బిజెపి నాయకులు అంతా కలిసి వెళ్లి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషాన్ని పంచుకున్నారు.

07/21/2017 - 02:03

హైదరాబాద్, జూలై 20: సిరిసిల్ల ఘటనలో అమాయకులను నిందితులుగా ముద్రవేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసులు వారిని హింసించిన ఘటనపై కాంగ్రెస్ లెజిస్లేచర్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిఎల్‌పి నేత జానారెడ్డి, సీనియర్‌నేతలు గీతారెడ్డి, భట్టివిక్రమార్క మాట్లాడుతూ కొందరు పోలీసుల చర్యల వల్ల మొత్తం తెలంగాణ పోలీసులకే మచ్చ వస్తోందన్నారు.

07/21/2017 - 01:59

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్-అపోలో మెడ్‌స్కిల్స్ సంయుక్తంగా బ్రాహ్మణ యువతకు (18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు) వైద్య ఆరోగ్య రంగంలో నైపుణాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ సర్ట్ఫికెట్ కోర్స్ ఇన్ డయాలిసిస్‌లలో శిక్షణ ఇస్తారు. యువత అర్హతను అనుసరించి ఈ కోర్సులకు ఎంపిక చేస్తారు.

07/21/2017 - 01:58

హైదరాబాద్, జూలై 20: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారికి చెందిన ఆబరణాల జాబితా, వాటి విలువతో సహా సమగ్ర నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ జాబితాను తార్నాకలోని పురావస్తు శాఖకు పంపిస్తున్నామని రెవెన్యూ (దేవాదాయ) కార్యదర్శి ఎన్. శివశంకర్ తెలిపారు. ఈ జాబితాను సేఫ్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.

07/21/2017 - 01:58

హైదరాబాద్, జూలై 20: ఎంపికైన స్టైపెండరి క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సిటి) పోలీస్ కానిస్టేబుళ్ల (కమ్యూనికేషన్స్)కు తొమ్మిది నెలలపాటు ఇచ్చే శిక్షణ గురువారం ప్రారంభమైంది.

07/21/2017 - 01:57

హైదరాబాద్, జూలై 20: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్యా కార్యాచరణ కమిటీ శుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, టివివి, టిఎస్‌ఎఫ్, ఎఐఎఫ్‌డిఎస్, పిడిఎస్‌యు, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యు, బిసివిఎస్, డిఎస్‌యు తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

07/20/2017 - 04:25

హైదరాబాద్, జూలై 19: సాంఘిక, బిసి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిగా కేవలం మహిళలను మాత్రమే నియమించేందుకు నిర్దేశించిన జీవో 1274ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్‌కు చెందిన కె సత్యనారాయణ మరి కొందరు ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు దీన్ని విచారించి జీవోను సస్పెండ్ చేశారు.

07/20/2017 - 04:25

హైదరాబాద్, జూలై 19: హైదరాబాద్ కూకట్‌పల్లిలో అదృశ్యమై ముంబయిలో ప్రత్యక్షమైన విద్యార్థిని పూర్ణిమసాయి వాంగ్మూలాన్ని మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసిపి భుజంగరావు నమోదు చేశారు. బాలిక పూర్ణిమసాయిని ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కాగా..తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి పూర్ణిమ ఇష్టపడడం లేదు. దీంతో ఆమెకు డిసిపి, ఏసిపి కౌనె్సలింగ్ ఇచ్చారు.

Pages