S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2017 - 23:31

హైదరాబాద్, జూలై 21: రాష్ట్రంలో అమలు జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో 75 శాతం పూర్తయినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి) సురేందర్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌తో పాటే డక్ట్ వేసిన పదివేల కిలోమీటర్ల పరిధిలో ఫైబర్ వేసేందుకు అంతా సిద్ధమైందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ డక్ట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని ఎస్‌ఈ, ఈఈలకు ఐటి శాఖ ప్రతినిధులు వివరించారు.

07/21/2017 - 23:30

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి తుది విడత కౌనె్సలింగ్ ఈ నెల 22వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కె వెంకటాచలం పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి 31వరకూ ఈ కౌనె్సలింగ్ జరుగుతుందని అన్నారు. ఈసేవ/మీ సేవ ద్వారా లేదా కాలేజీల హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.

07/21/2017 - 23:30

హైదరాబాద్, జూలై 21: భారతదేశంలోని మొత్తం 2.1 మిలియన్ల మంది ఎయిడ్స్‌రోగులు ఉండగా, సాలీనా కొత్తగా 80 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద 95 శాతం ఎయిడ్స్ వ్యాధి ఉన్న పది దేశాల్లో భారత్ ఒకటి. ఈ వివరాలను యుఎన్ ఎయిడ్స్ రిపోర్టులో పేర్కొంది.

07/21/2017 - 23:29

హైదరాబాద్, జూలై 21: మత్తు పదార్థాలు (డ్రగ్స్) వినియోగిస్తున్న వారిలో ఇంకా ఎంత మంది ఉన్నారో! ఎక్సైజ్, టాస్క్ఫోర్సు పోలీసులకు అంతుచిక్కడం లేదు. తవ్విన కొద్దీ కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదో పది మంది పట్టుబడ్డారు, వారిని విచారించి, విచారణ ముగించే పరిస్థితి లేదు. ఒకరిని విచారిస్తే, మరో నాలుగైదు పేర్లు బయటపెడుతున్నారు. ఇలా విచారణ కొనసాగుతూనే ఉన్నది.

07/21/2017 - 23:29

హైదరాబాద్, జూలై 21: జాతీయరహదారుల నిర్మాణానికి భూసేకరణ విషయమై అధికారులు అవలంభిస్తున్న వైఖరి పట్ల రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత భూసేకరణ చట్టాలను అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రాంతాల్లో పరిహారం చెల్లింపు సమస్యలను అధిగమించేందుకు నూతన భూసేకరణ చట్టం జివో 120ని అనుసరించి పరిహారం చెల్లించేవిధంగా నియమావళిలో మార్పులు చేపట్టాలన్నారు.

07/21/2017 - 03:43

మహబూబాబాద్, జూలై 20: మహబూబాబాద్ జిల్లాలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. జిల్లా పరిధిలోని గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న దళానికి చెందిన శ్యాం దళం వారి సభ్యులతో బుధవారం అర్ధరాత్రి గ్రామంలో అన్న, తమ్ముళ్ల పంచాయితీ చేస్తున్నారు.

07/21/2017 - 03:41

కరీంనగర్, జూలై 20: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో 39చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. వాటి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, రెండు నెలల్లో వాటిని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

07/21/2017 - 03:39

నిజామాబాద్, జూలై 20: చుట్టపుచూపుగా పలకరిస్తున్న చెదురుముదురు వానలు తప్ప, ఆశించిన రీతిలో ఏకధాటిగా వర్షాలు కురియని కారణంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిన నీటి నిల్వలతో వెలవెలబోతున్నాయి. గతేడాదితో ఇదే సమయానికి పోలిస్తే దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్లోనూ గణనీయంగా నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

07/21/2017 - 03:39

గోవిందరావుపేట, జూలై 20: గత కొంత కాలంగా స్తబ్దతగా ఉన్న ఏజెన్సీలో మళ్లీ మావోల కలకలం మొదలైంది. నక్సల్స్‌కు పట్టుకొమ్మలా ఉన్న పస్రా అటవీప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో గత కొన్ని సంవత్సరాల నుండి పస్రా అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉనికి తగుముఖం పట్టింది.

07/21/2017 - 03:38

నల్లగొండ, జూలై 20: కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతులను బిచ్చగాళ్లుగా చేస్తోందని ఎకరాకు నాలుగు వేలు ఇవ్వడం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం కావ ని, ఆత్మహత్యలు ఆగబోవని బిజెపి శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Pages