S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/16/2018 - 05:46

సూర్యాపేట, నవంబర్ 15: పేద ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ‘మేము సైతం మీతోనే’ నినాదంతో హమాలీ సంఘం ఆధ్వర్యలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వం కార్మిక సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఉందన్నారు.

11/16/2018 - 05:45

చందుర్తి, నవంబర్ 15: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎన్నో లేఖలు రాశారని, ఆ లేఖలను బహిర్గతం చేశానని, వాటిని వెనక్కి తీసుకొనే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు అన్నారు.

11/16/2018 - 05:44

కొత్తకోట, నవంబర్ 15: కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీమసీదును కూల్చి వేశారని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సాయంత్రం కొత్తకోట రోడ్డుషోలో ఆయనతో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఇంతియాజ్, ఇప్తార్ అహ్మద్ పాల్గొన్నారు.

11/16/2018 - 05:43

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ రాష్ట్ర పార్టీ నాయకత్వంపై చిందులు తొక్కారు.

11/15/2018 - 16:26

హైదరాబాద్: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖారురుచేసినట్లే. ఈరోజు సుహాసిని విశాఖకు వచ్చి నోవెటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలుసుకున్నారు.

11/15/2018 - 16:19

హైదరాబాద్: తెలంగాణ నాయకులకు పాలనే చేతకాదని ఎద్దేవా చేశారని, కాని తలెత్తుకునేలా పాలన చేశామని, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ దేశానికే తలమానికమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన గురువారంనాడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు.

11/15/2018 - 12:43

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ దాడులు జరిగాయి. దాదాపు 25మందితో కూడిన అధికారుల బృందం కాటేదాస్‌లో గల డ్యూట్ బిస్కెట్ల కంపెనీల్లోనూ, డీఎన్‌ఏ బిల్డర్స్ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.

11/15/2018 - 06:08

సిద్దిపేట, నవంబర్ 14 : కోనాయిపల్లి వెంకన్న ఆశీర్వాదం, మీ దీవేనలతో వంద సీట్లు సాధించి మళ్లీ అధికారాన్ని చేపడుతానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్న ఏ యుద్ధంలో ఇంతవరకు అపజయం లేదని, అన్ని విజయాలే సిద్ధించాయని కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి జలాలు తీసుకొచ్చి వెంకటేశ్వరస్వామి పాదాలకు అభిషేకం చేయాలని మంత్రి హరీష్‌రావును కోరుతున్నట్లు తెలిపారు.

11/15/2018 - 06:05

హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే తాత్కాలిక షెడ్యూలు రూపొందడంతో ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షలు, రానున్న విద్యాసంవత్సరాలకు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో ఫీజులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది.

11/15/2018 - 06:04

హైదరాబాద్, నవంబర్ 14 : ఎన్నికల సందర్భంగా పోలీసులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసి డబ్బు, బంగారం తదితరాలను స్వాధీనం చేసుకుంటున్న కేసుల్లో సామాన్యులే ఇక్కట్లకు గురవుతున్నారు.

Pages