S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/23/2019 - 04:17

హైదరాబాద్, మే 22: రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మర్నాడే మండల జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలు ఎన్నికల సంఘం కమిషనర్ వీ నాగిరెడ్డిని కోరారు.

05/23/2019 - 04:08

హైదరాబాద్, మే 22: తెలంగాణలో 31వ తేదీన ఎడ్‌సెట్ నిర్వహణకు సర్వంసిద్ధం చేశామని కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళిని తెలిపారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3.30 నుండి 5.30 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పు చేశామని దానిని అభ్యర్ధులు గుర్తించాలని ఆమె సూచించారు.

05/22/2019 - 17:28

హైదరాబాద్: తెలంగాణలో 126 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని, రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల పరిధిలో 443 మంది అభ్యర్థులు పోటీపడ్డారని తెలిపారు. కాగా ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుది నిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదని అన్నారు.

05/22/2019 - 13:25

హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ నాలుగవ రోడ్డులో ద్విచక్ర వాహనం టాటాఎస్ వాహనంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో నాగార్జునరెడ్డి ఆనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

05/22/2019 - 04:43

కామారెడ్డి, మే 21: పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతిని వికృతిగా మార్చే ప్రమాదకరమైన ప్లాస్టిక్ వాడకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠితర చర్యలకు ఉపక్రమించాయ.

05/22/2019 - 04:25

నల్లగొండ టౌన్, రెబ్బెన, జమ్మికుంట, మే 21: వడదెబ్బకు రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెంలో ఉపాధి హామీ పథకం కూలీ మునగాల సైదమ్మ (30) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సైదమ్మ దంపతులు రోజుకూలీ జీవనోపాధిగా బతుకుతున్నారు.

05/22/2019 - 04:24

హైదరాబాద్, మే 21: ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ అన్ని విధాలా విఫలమయ్యారని, ఒక దశలో బెంగాల్ సీఎంను బెదిరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. తమతోనే ఉండాలని లేకుంటే బెంగాల్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ బెదిరిస్తోందని, ఇలాంటి బెదిరింపులకు మమతా బెనర్జీ భయపడేది లేదని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని పేర్కొన్నారు.

05/22/2019 - 04:23

హైదరాబాద్, మే 21: ఇంజనీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను బుధవారం సాయంత్రం 2.40 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ హెచ్ వీసీ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేస్తారు.

05/22/2019 - 04:22

హైదరాబాద్, మే 21: ఫిబ్రవరి 17న నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను 27వ తేదీ సాయంత్రం ఐదుగంటలకు విడుదల చేస్తామని గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మార్చి 31న నిర్వహించిన తెలంగాణ సోషల్‌వెల్ఫేర్ రెసిడెన్షియల్ సీఓఈ కాలేజీల్లోని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను 23వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడదల చేస్తారు.

05/22/2019 - 04:22

సూర్యాపేట, మే 21: తనను, తన తోటి సిబ్బందిని ఎస్‌ఐ వేధిస్తుండటంతో పాటు అవినీతికి పాల్పడుతున్నాడని రెండురోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Pages