S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2017 - 03:47

ధర్మారం, డిసెంబర్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో భాగంగా కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని పంప్ హౌస్ నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం పరిశీలించారు.

12/09/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 8: జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశం మేరకు ఈ నెల 9న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఎస్.రాధాకృష్ణమూర్తి తెలిపారు. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు భవన సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

12/09/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 8: ట్రస్టులు, కంపెనీల ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని, 50 శాతం కమీషన్ కూడా ఇస్తామని మోసం చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఆరు నకిలీ డైమండ్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

12/09/2017 - 01:51

హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్ నగరంలో ఎన్నారై భవన నిర్మాణం కోసం సిఎం కెసిఆర్‌తో మాట్లాడతానని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన స్థలం ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఆయనను ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఎన్నారై సభ్యులు కలిశారు.

12/09/2017 - 01:48

హైదరాబాద్, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును రైతు వ్యతిరేకి అంటారా? అని రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను రైతు వ్యతిరేకి అంటే క్షమించేది లేదని హెచ్చరించారు.

12/09/2017 - 01:45

హైదరాబాద్, డిసెంబర్ 8: ఈ నెల 14వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు మహానగరంలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభకు ‘మహా’నగర పాలక సంస్థ ఏర్పాట్లకు సిద్దమైంది. పదిరోజుల క్రితం హైటెక్స్ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కు ప్రదాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక అతిధులుగా హాజరుకావటంతో పలు మెయిన్‌రోడ్లలో, చారిత్రక కట్టడాల వద్ద చేపట్టిన సుందరీకరణ పనులను మరింత మెరుగుపర్చనున్నారు.

12/09/2017 - 00:04

హైదరాబాద్, డిసెంబర్ 8: ఈ నెల 15న మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసిఈఎంఈ)లో ఆఫీసర్స్ డిగ్రీ ఇంజినీరింగ్ (డిఈ-98), ఆఫీసర్స్ టెక్నికల్ ఎంట్రీ స్కీం (టిఈఎస్-28) పూర్తి చేసిన వారికి స్నాతకోత్సవం జరుగుతుందని ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్య అతిథిగా ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బి) హైదరాబాద్ డీన్ రాజేంద్ర కె.శ్రీవాస్తవ స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారు.

12/09/2017 - 00:03

హైదరాబాద్, డిసెంబర్ 8: భూముల సర్వే ముగిసేలోగా ప్రతి అటవీ భూమిని రికార్డుల్లోకి రావాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు జిల్లాల అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పికె ఝూ, వైల్డ్ లైఫ్ పిసీసీఎఫ్ డాక్టర్ మనోరంజన్ భాంజా తదితరులు శుక్రవారం జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

12/09/2017 - 00:03

హైదరాబాద్, డిసెంబర్ 8: బీసీ సబ్-ప్లాన్‌ను రూ.20 వేల కోట్లతో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.

12/09/2017 - 00:02

హైదరాబాద్, డిసెంబర్ 8: టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఆ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పార్టీ కార్యాలయంలోకి వెళ్ళాలని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.

Pages