S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/07/2017 - 00:17

హైదరాబాద్, డిసెంబర్ 6: నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ, తెలంగాణ 5వ స్థానంలో ఉన్నాయి. నకిలీ నోట్లను ముద్రించి, చలామణి చేస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేశాయి. గుజరాత్ ప్రధమ, పశ్చిమ బెంగాల్ ద్వితీయ స్థానంలో ఉన్నాయి.

12/07/2017 - 00:16

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశవ్యాప్తంగా 60ఏళ్లు, ఆపైబడిన వృద్ధులపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. 2014లో 17,652 కేసులు నమోదయ్యాయి. 2015లో 19,239 కేసులు నమోదు కాగా, 2016లో 20,657 దాడులు జరిగాయి. దేశంలోని 19 మెట్రో నగరాల్లో 4,694 కేసుల నమోదుతో మహరాష్ట్ర ముందుండగా, మధ్యప్రదేశ్ 3877 కేసులో రెండో స్థానంలో ఉంది.

12/07/2017 - 00:15

హైదరాబాద్, డిసెంబర్ 6: రాష్ట్ర రాజధానిలోని దుకాణాలు, ఎస్టాబ్లిష్‌మెంట్లలో పనిచేసే వారికి 2018 లో ఎనిమిది రోజులను వేతనంలో కూడిన సెలవు రోజులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది.

12/06/2017 - 23:57

కరీంనగర్‌కు చేరుకున్న కేసీఆర్ కాళేశ్వరం, మిడ్ మానేర్ పనులపై సమీక్షలు
ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం

12/06/2017 - 22:21

వనపర్తి, డిసెంబర్ 6: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరచడమే ప్రభు త్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నా రు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో 7.65 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

12/06/2017 - 22:21

మహబూబ్‌నగర్, డిసెంబర్ 6: రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడిన పడాలంటే మరో పదేళ్లు పడుతుందని, పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడంతో గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించాల్సి వస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.49 కోట్లతో నిర్మించే వివిధ భవనాల శంకుస్థాపనలకు మంత్రి కడియం శ్రీహరి బుధవారం శ్రీకారం చుట్టారు.

12/06/2017 - 22:20

మర్రిగూడ, డిసెంబర్ 6: డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా మండలంలోని శివన్నగూడెం గ్రామ శివారులో చర్లగూడెం ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడు రోజుల నుంచి భూ నిర్వాసితులు నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పోలీసులు అకారణంగా లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ గత రెండు రోజులుగా అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వ తీరును ఎండగడుతూ ధర్నా చేశారు.

12/06/2017 - 22:19

వలిగొండ, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉద్యమంలా చేపట్టిన భూరికార్డుల శుద్ధీకరణతో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోకారం గ్రామంలో రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

12/06/2017 - 03:55

హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 5: నగరంలోని చైతన్యపురిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమికుడి వేధింపులు తాళలేక ఓ వైద్యురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమలో మోసపోయాను..చనిపోతున్నానంటూ కుటుంబీకులకు ఫోన్ చేసి బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చైతన్యపురిలో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లాకు చెందిన గీతాకృష్ణ ఎంబీబీఎస్ చదివింది.

12/06/2017 - 03:54

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం దేశానికే ఆదర్శంగా ఉండేలా చూస్తామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లోని సిపార్డ్‌లో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయితీరాజ్ చట్టాన్ని సమగ్రంగా రూపొందించేందుకు నియామకం అయిన అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

Pages