S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/07/2017 - 01:31

హైదరాబాద్, డిసెంబర్ 6: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్ అందించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.

12/07/2017 - 01:30

హైదరాబాద్, డిసెంబర్ 6: సామాజిక న్యాయం కేవలం తమ పార్టీతోనే సాధ్యమని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో సామాజిక న్యాయం చేసి అన్ని వర్గాలకు సమాన న్యాయం అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంటుందని ఆయన తెలిపారు.

12/07/2017 - 00:22

హైదరాబాద్, డిసెంబర్ 6: మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పాత చెరువుల పునరుద్ధరణే కాకుండా కొత్తగా చెరువుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువులు, ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువులను నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు.

12/07/2017 - 00:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందు బుధవారం పిటిషన్ విచారణ వచ్చింది.

12/07/2017 - 00:21

హైదరాబాద్, డిసెంబర్ 6: అవకాశాలకు ఆకాశమే హద్దు అనే విషయాన్ని యువత గుర్తించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా దృష్టిసారిస్తే చేరుకోలేమనే భయం అక్కర్లేదని అన్నారు.

12/07/2017 - 00:20

హైదరాబాద్, డిసెంబర్ 6: హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి,కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజనల్ కమిటీ పిలుపునిచ్చింది. 1992 డిసెంబర్ 6న హిందూ మతోన్మాద శక్తులు బాబ్రీ మసీదును కూల్చి రెండు మతాల మధ్య చిచ్చురేపారని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

12/07/2017 - 00:20

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మల్టీ లెవెల్ ఫంక్షన్ హాలు నిర్మాణానికి జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహారించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

12/07/2017 - 00:19

హైదరాబాద్, డిసెంబర్ 6: ఔషధాల తయారీ సంస్థలు క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సివో) అనుమతులు ఇస్తోంది. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఫార్మా కంపెనీలు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ గురించి ముందస్తు సమాచారం తమ వద్ద లభించడం లేదని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రాన్ని కోరుతున్నాయి.

12/07/2017 - 00:19

అమరావతి, డిసెంబర్ 6: పార్టీ ఫిరాయింపుల చట్టం అమలుపై ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లకు నైతిక సంకటంలా పరిణమించింది. సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపు నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లేనని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

12/07/2017 - 00:18

హైదరాబాద్, డిసెంబర్ 6: కాంగ్రెస్, టిడిపీ ప్రభుత్వాల హయాంలో బిసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూసాయని టిఆర్‌ఎస్ విమర్శించింది. బిసీలలో నాలుగు, ఐదు ప్రధాన కులాలను అడ్డంపెట్టుకొని 113 అట్టడుగు కులాలను అణచివేసే దుర్మార్గపు రాజకీయం చేసాయని టిఆర్‌ఎస్ ఆరోపించింది.

Pages