S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/13/2017 - 02:22

హైదరాబాద్, డిసెంబర్ 12: 2019లో తెలంగాణ రాష్ట్ర సమితిని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా దీక్ష బూనాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

12/13/2017 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 12: ఎస్సీ,ఎస్టీల తరహాలో బిసిలకు కూడా సబ్‌ప్లాన్ అమలుచేయాలని బిసి సంక్షేమ శాసనసభ కమిటీలో మొదటి అంశంగా చేర్చినట్టు బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీలో స్పీకర్ మధుసూధనాచారి, ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.

12/13/2017 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు హాజరై ఎంపికైన ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలో అమ్మాయిల పట్ల ఆకతాయిగా వ్యవహరించిన కేసులు వెలుగు చూడడంతో బోర్డు ఉద్యోగాలకు వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించింది. ఈ ఇద్దరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

12/13/2017 - 02:20

హైదరాబాద్, డిసెంబర్ 12: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిసిల అభివృద్ధికి జరిగిన చర్చ సందర్భంగా అనేక సూచనలు వచ్చాయని వాటిని వెంటనే అమలు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు సీఎంకు లేఖ రాశారు. బిసిల అభ్యున్నతి, సాధికారత, సంక్షేమం, విద్యా ఉద్యోగ అవకాశాలు, రాజకీయంగా సముచిత స్థానం కల్పించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు.

12/12/2017 - 03:54

హైదరాబాద్, డిసెంబర్ 11: టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని, అవి ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రజా సంక్షేమాలను పూర్తిగా విస్మరించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో పదేళ్ల పాటు జరిగిన కాంగ్రెస్ అవినీతిని ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు.

12/12/2017 - 03:53

హైదరాబాద్, డిసెంబర్ 11: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లు తగ్గాయి. 2014లో చైన్ స్నాచింగ్‌ల కేసులు 425 నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ వరకు 55 వరకు మాత్రమే జరిగాయి. మూడేళ్లలో 90 శాతం మేరకు కేసులు తగ్గాయి. 2014 కంటే 2015లో కొంత తగ్గుదల, 2016లో మరింత తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది పదకొండు నెలల్లో మెరుగైన ఫలితాలు రావడంతో పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చింది.

12/12/2017 - 03:15

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లను చేస్తున్నారు. సభల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథులకు, హాజరయ్యే భాషాభిమానులకు సైతం ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈనెల 15న ప్రారంభ కార్యక్రమం, 19న ముగింపు కార్యక్రమం జరగనున్నాయి.

12/12/2017 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 11: రహదారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారుల భద్రతకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు కె. తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారి ప్రమాదాలు, భద్రతపై కూలంకషంగా చర్చించారు.

12/12/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 11: వెనుకబడిన వర్గాలకు రూ.20 వేల కోట్లతో సబ్-ప్లాన్ ఏర్పాటు చేయాలని, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కోరారు.

12/12/2017 - 03:09

హైదరాబాద్, డిసెంబర్ 11: రైతులకు మేలు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వ్యవసాయ రంగంలో ‘తొలి దశకం విధాన పత్రం’ (్ఫస్ట్ డికేడ్ డాక్యుమెంట్) రూపొందించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. వ్యవసాయం, ఉద్యాన శాఖలతో పాటు సంబంధిత కార్పొరేషన్లు, యూనివర్సిటీల ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి సచివాలయంలో సోమవారం సమావేశమయ్యారు.

Pages