S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/12/2017 - 00:30

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎఐసిసి అధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్ గాంధీ దేశం గర్వించదగ్గ నాయకుడని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. ఎఐసిసి అధ్యక్షునిగా రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆయన హర్షం ప్రకటించారు. 47 ఏళ్ళ రాహుల్‌కు రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేగల సత్తా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

12/12/2017 - 00:30

హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం కాదని, తెలుగును ప్రోత్సహించేందుకు తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) పేర్కొంది. ప్రాధమిక, మాధ్యమిక విద్యలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెప్పడం కాదని, పెద్ద ఎత్తున ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని డిటిఎఫ్ ప్రశ్నించింది.

12/12/2017 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 11: పాత పది జిల్లాల ప్రాతిపదికపైనే ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం తాజాగా జీవో 33ను జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల ప్రాతిపదికపై ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం గత అక్టోబర్ 10న జీవో -25ను జారీ చేసింది. ఆ జీవోను సవరించుకుని పాత జిల్లాల ప్రాతిపదికపైనే నియామకాలు జరపాలని హైకోర్టు ఆదేశించడంతో తదనుగుణంగా ప్రభుత్వం పాత జీవోకు సవరణలు చేసింది.

12/12/2017 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎపి వికాస్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు సోమవారం నాడు కొట్టి వేసింది. పదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల సంఖ్య ఇతర వివరాలను అందుబాటులో లేనందున ఈ తరహా ఉత్తర్వులను ఇవ్వలేమని న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.
కంచ ఐలయ్యకు ఊరట

12/11/2017 - 04:46

భువనగిరి, డిసెంబర్ 10: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచే సే లక్ష్యంగా 2018 జనవరి నుండి కార్యాచరణ చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యవర్గ, పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

12/11/2017 - 04:44

హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ ప్రకటించాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బిసి అజెండాతోనే వచ్చే ఎన్నికల్లో బిసి ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళతామని అన్నారు. ఆదివారం నాడిక్కడ బిసి సంఘాల విస్తత్ర స్థాయి సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

12/11/2017 - 04:43

ఆర్మూర్, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్రంలో 90 శాతం పూర్తయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ చెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వగృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భూ ప్రక్షాళన చేపట్టడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు.

12/11/2017 - 04:39

నల్లగొండ, డిసెంబర్ 10: అధికారం లేకుండా ఉండలేని కాంగ్రెస్ నాయకులు నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు, అధికార దాహంతో రాజకీయ పునరేకీకరణ ప్రయత్నాలు చేస్తున్నార ని భారీ నీటిపారుదల శాఖ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం మంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి నాగార్జున సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

12/11/2017 - 04:38

నాగార్జునసాగర్, డిసెంబర్ 10: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన దినోత్సవాన్ని ఆదివారం డ్యాం అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఆదివారం నాటికి 62 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డ్యాం పునాది రాయి వద్ద రంగులతో, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.

12/11/2017 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 10: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు)లో బోధనేతర కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సిఎంకు లేఖ రాశారు. దాదాపు 25 ఏళ్ల నుంచి బోధనేతర సిబ్బంది కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్నారని అన్నారు.

Pages