S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/11/2017 - 04:01

హైదరాబాద్, డిసెంబర్ 10: పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదని రాష్ట్రప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సెజ్‌లకు భూముల కేటాయింపుపై దేశ వ్యాప్తంగా వస్తున్న అనేక విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

12/11/2017 - 00:36

హైదరాబాద్, డిసెంబర్ 10: కాంగ్రెస్ పార్టీ ఎంతగా అరిచిగీపెట్టినా మరో 20 ఏళ్లవరకు అధికారం తమదేనని, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కంటున్న కలలు కల్లలవడం ఖాయమని టిఆర్‌ఎస్ పార్టీ పేర్కొంది. మెదక్ ఉప ఎన్నిక మొదలుకొని సింగరేణి ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కకపోయినా ఆ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదని టిఆర్‌ఎస్ దుయ్యబట్టింది.

12/11/2017 - 00:34

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపైన వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. గత మూడేళ్లలో దాదాపు 300 వరకు నివేదికలను విజిలెన్స్ శాఖ ఇచ్చినా ఇంతవరకు స్పందన లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు.

12/10/2017 - 04:23

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘కెసిఆర్‌కు హఠావో...తెలంగాణకో బచావో’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం గాంధీ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. సోనియా జన్మదినంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాడు ఆమె ప్రకటన చేసినందున కృతజ్ఞతలు తెలియజేస్తూ సభను ఏర్పాటు చేశారు.

12/10/2017 - 04:23

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై ఇక ధర్మయుద్ధం చేద్దాం..’ అని ఇటీవల టి.టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని తూర్పారబట్టారు.

12/10/2017 - 04:22

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మొదటి ర్యాంకును రెండోసారి వరుసగా చేజిక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉరకలేస్తోంది. పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుమతులు ఇవ్వడం, ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంస్కరణలను, వాటి ఫలాలను సామాన్యులకు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు వరసగా రెండోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకు ఖాయమంటున్నారు.

12/10/2017 - 04:21

హైదరాబాద్/ఎల్‌బీనగర్, డిసెంబర్ 9: లంబాడీలను ఆదివాసీల నుంచి తొలగించాలని కొమురం భీం మనువడ కొమురం సోలేవాల్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమురంభీం స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. ఆదివాసీలకంటూ ప్రత్యేక రిజర్వేషన్ కావాలని కోరారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు చేపట్టిన ఆత్మగౌరవ బహిరంగ సభ విజయవంతమైంది.

12/10/2017 - 04:20

ఆదిలాబాద్, డిసెంబర్ 9: గిరిజన పల్లెల్లో ఆదివాసీ, లంబాడీల మధ్య రగులుతున్న వివాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాజ్యాంగపరంగా ఎస్టీలకు సంక్రమించిన రిజర్వేషన్ ఫలాలను 90 శాతం వలస లంబాడాలే అనుభవిస్తూ ఆదివాసీ మూల జాతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీ గిరిజనులు శనివారం హైదరాబాద్ మహాగర్జన సభకు భారీగా తరలివెళ్ళారు.

12/10/2017 - 04:17

హైదరాబాద్, డిసెంబర్ 9: ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రస్తుతం జరుగుతున్న సభలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

12/10/2017 - 04:17

హైదరాబాద్, డిసెంబర్ 9: ప్రపంచ తెలుగు మహాసభల పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సంగ్ ఆదేశించారు. మహాసభల పనులపై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదిక, ప్రతినిధులు కూర్చునే సీటింగ్ ఏర్పాట్ల లేఅవుట్‌పై పరిశీలించారు. ప్రతినిధులకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భోజనాన్ని, తెలంగాణ రుచులతో అందించాలని సూచించారు.

Pages