S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2017 - 00:01

హైదరాబాద్, డిసెంబర్ 8: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై వారం రోజులుగా సాగుతున్న రగడ నానాటికీ తీవ్రమవుతోంది. శుక్రవారం నాడు విద్యార్థులు ఇబ్రహీంపట్నంలోని సివిఆర్ కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మరో పక్క ఎబివిపి విద్యార్థులు సిబిఐటి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 20 మంది ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

12/09/2017 - 00:01

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలోని మున్సిపాలిటీలకు శుభవార్త. మంచినీటి అవసరాలు, పౌర, వౌలిక సదుపాయాల నిమిత్తం ఎల్‌ఆర్‌ఎస్, బిపిఎస్ ద్వారా వచ్చిన నిధులను ఖర్చు పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ను మినహాయిస్తే 70 నగరపాలక సంస్ధలు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు ఉన్నాయి.

12/08/2017 - 04:15

హైదరాబాద్, డిసెంబర్ 7: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ విచ్చేసిన భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శుక్రవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

12/08/2017 - 04:15

నిజామాబాద్, డిసెంబర్ 7: దశాబ్దాల కాలం నుండి పెండింగ్‌లో నానుతూ వస్తున్న అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టుకు సమీప భవిష్యత్తులో మోక్షం లభించే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. సాగునీటి పథకాల నిర్మాణాలకు పెద్దపీట వేస్తున్న తెరాస ప్రభుత్వ హయాంలోనైనా లెండి పనులు కొలిక్కి వస్తాయని భావిస్తున్న సరిహద్దు ప్రాంత రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది.

12/08/2017 - 04:13

సిరిసిల్ల, డిసెంబర్ 7: సిరిసిల్ల పట్టణంలో ఉద్యోగం రాలేదన్న బెం గతో మనస్తాపానికి గురై గడ్డం వం శీ (23) అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

12/08/2017 - 04:11

సూర్యాపేట, డిసెంబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వంత రాష్ట్రం గుజరాత్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని, అక్క డి ఫలితాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా రాజకీయంగా పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తూ గురువారం జిల్లాకేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

12/08/2017 - 04:11

సంగారెడ్డి, డిసెంబర్ 7: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రజలందరికీ రక్షిత మంచి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధం గా భగీరథ ప్రయత్నంగా ముఖ్యమంత్రి మిషన్ భగీరథను ప్రారంభించారని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

12/08/2017 - 03:54

హైదరాబాద్, డిసెంబర్ 7: స్మార్ట్ సిటీ కింద వరంగల్‌లోని భద్రకాళి సరస్సు, వెయ్యి స్తంభాల గుడి పరిసర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరుచాలని మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 8వ బోర్డు సమావేశం గురువారం ఇక్కడ జరిగింది.

12/08/2017 - 03:52

హైదరాబాద్, డిసెంబర్ 7: ఎన్నారై కోటాలో మెడికల్, ఇంజనీర్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడుతోన్న ఓ బోగస్ సంస్థ నిర్వాహకుడిని నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి వివిధ కళాశాలలకు చెందిన బ్రోచర్లు, మెడికల్, ఇంజనీర్, వెటర్నరీ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ ఫారాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ‘కెరీర్స్ గేట్‌వే’ను సీజ్ చేశారు. రూ.

12/08/2017 - 03:52

హైదరాబాద్, డిసెంబర్ 7: సమర్ధులు, అంకితభావం కలిగిన ఉద్యోగులపైనే ఏ సంస్థ విజయమైనా ఆధారపడి ఉంటుందని భారత రైల్వే బోర్డు చైర్మన్ అశ్విన్ లోహాని అన్నారు. ఒక సంస్థకు నిధులు, వస్తువనరులు ఎంతగానో అవసరమైనప్పటికీ, ఆ సంస్థ విజయం మాత్రం ఆ ఉద్యోగుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Pages