S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2017 - 04:19

హైదరాబాద్, డిసెంబర్ 8: మిషన్ కాకతీయ నాలుగవ దశ పనుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నాలుగవ దశలో చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణకు సంబంధించి శుక్రవారం నాడు 15 జీవోలు విడుదల చేసింది. 149 చెరువులకు పునరుద్ధరణ పనుల కోసం రూ.45 కోట్లను మంజురు చేసినట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

12/09/2017 - 04:18

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథతో పాటు మిగిలిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర అధికార బృందం ప్రశంసించింది. మిషన్ భగీరథను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ యోచిస్తున్నారని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అధ్యయనంలో భాగంగా కేంద్రప్రభుత్వ అధికారుల బృందం విచ్చేసింది.

12/09/2017 - 04:18

హైదరాబాద్, డిసెంబర్ 8: అధికారపక్షమైన తెరాస ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, అనునిత్యం వేడుకల్లో తేలియాడుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కెజి టు పిజి అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ప్రైవేటు జూనియర్ కాలేజీలతో కుమ్మక్కైందని ఆరోపించారు.

12/09/2017 - 04:17

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలుగు వైభవాన్ని చాటే విధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సిఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ఆ హోర్డింగ్స్‌లో సుప్రసిద్దులైన తెలుగు కవులు, రచయితల పేర్లు, వారి విశిష్టతను తెలియజేసే వ్యాఖ్యలు రాయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా హోర్డింగ్స్‌పై రచయితలు, వైతాళికుల పెయింటింగ్స్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

12/09/2017 - 04:15

గజ్వేల్, డిసెంబర్ 8: విద్యార్థుల మృతి దేశానికి అరిష్టమని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి శౌర్యవీర్‌సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఓయూలో మృతి చెందిన మురళి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/09/2017 - 04:15

మర్రిగూడ, డిసెంబర్ 8: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడెం గ్రామ శివారులో నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ముంపు గ్రామాల ప్రజలు వంద రోజులకు పైగా శాంతియుతంగా నిరవధికంగా ధర్నాను కొనసాగించారు.

12/09/2017 - 04:13

నల్లగొండ, డిసెంబర్ 8: నల్లగొండ శిశుగృహ నుండి మరో అనాథ చిన్నారికి అమెరికన్ అమ్మఒడి ఆసరా దక్కింది. ఇటీవల డెన్మార్క్‌కు చెందిన మార్టిన్, అమెరికా కాలిఫోర్నియాకు చెందిన కార్మెన్ అలురేజ్‌లు చెరొక అనాథ ఆడశిశవులను దత్తత తీసుకుని వెళ్లారు. ఇదే పద్ధతిలో అమెరికా టెనె్నస్సీకి చెందిన మరో అమెరికన్ వనిత నెల్లా కాన్‌ఫీల్డ్ మరో అనాథ చిన్నారిని దత్తతకు తీసుకోవడం విశేషం.

12/09/2017 - 04:09

మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: కార్పోరేట్ విద్యాసంస్థల ఒత్తిళ్ల కారణంగానే విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఇది బాధాకరమైన అంశమని వీటిపై పాలకులు, మేధావులు, సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో పిడిఎస్‌యు 21వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం అయ్యాయి.

12/09/2017 - 03:50

హైదరాబాద్, డిసెంబర్ 8: రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందించడంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రయోగాత్మకంగా ఐరిస్, బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు.

12/09/2017 - 03:49

హైదరాబాద్, డిసెంబర్ 8: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రజాస్వామ్యయుతంగా పోరుసాగించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్‌ఎండిసి స్వర్ణోత్సవ వేడుకలను శుక్రవారం నాడు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

Pages