S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/11/2017 - 02:11

కాకినాడ, ఆగస్టు 10: ప్రతిపక్ష నేతగా బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడటానికి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిన చంద్రబాబు ఏ విధమైన అనుమతులు తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన స్వగృహంలో గురువారం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అబద్ధాలకు కాపు జాతి యావత్తూ సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు.

08/11/2017 - 02:05

హైదరాబాద్, ఆగస్టు 10: ఉస్మానియా యూనివర్శిటీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (నేక్) గుర్తింపు కోసం ఈ నెల 17న ప్రత్యేక పరిశీలన బృందం రానుంది. ఈ బృందానికి ప్రొఫెసర్ ఎస్ కె సింగ్ చైర్మన్‌గా ఉంటారు. మెంబర్ కో ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ సతీందర్ సింగ్ వ్యవహరిస్తారు.

08/11/2017 - 02:04

హైదరాబాద్, ఆగస్టు 10: భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారు (పారిశ్రామికవేత్త)ల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఇవాంకా తదితరులు హాజరవుతున్నందుకు సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

08/11/2017 - 02:04

హైదరాబాద్, ఆగస్టు 10: నగరంలోని విదేశీయుల నివాసాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వీసా గడువు కాలం ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో నివాసముంటోన్న విదేశీయుల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు.

08/11/2017 - 02:03

హైదరాబాద్, ఆగస్టు 10: మల్లన్నసాగర్ టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఈ దశలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలంటూ జి లక్ష్మి తదితరులు దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావువిచారించారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.

08/11/2017 - 02:18

హైదరాబాద్, ఆగస్టు 10: కార్మికుల సమిష్టి కృషితోనే దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి సాధిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో దక్షిణ మధ్య రైల్వేకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కార్మికులదేనని ఆయన అన్నారు. గురువారం సికిందరాబాద్‌లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ 47వ, వార్షిక సదస్సును ఆయన ప్రారంభించారు.

08/11/2017 - 02:02

హైదరాబాద్, ఆగస్టు 10: ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరు, ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎబివిపి ఇచ్చిన బంద్ పిలుపుతో రాష్ట్రం అట్టుడికిపోయింది. రెండు విద్యార్థి సంఘాల పిలుపుతో జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి. అనేక పట్టణాల్లో వందలాది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. పలు పట్టణాల్లో విద్యార్థి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

08/11/2017 - 02:19

హైదరాబాద్, ఆగస్టు 10: రాష్ట్రంలో బియ్యం సేకరణలో నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. ఇప్పటికే మిల్లర్లు 54 శాతం బియ్యాన్ని అప్పగించారని, మిగిలిన 46 శాతం కూడా ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

08/10/2017 - 22:59

హైదరాబాద్, ఆగస్టు 10: మాదకద్రవ్యాల అలవాటు మంచిది కాదని, వాటికి దూరంగా ఉండడమే కాకుండా, అలాంటి అలవాటు ఉన్న వారి వివరాలు తెలియజేయాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ యువతకు సూచించారు. గురువారం హైదరాబాద్ జెఎన్‌టియులో జరిగిన డ్రగ్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ ప్రాణాంతకమని, వీటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.

08/10/2017 - 22:59

హైదరాబాద్, ఆగస్టు 10: మాజీ మంత్రి తనయుడు విక్రమ్‌గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటనపై విక్రమ్ భార్య షిఫాలి వాంగ్మూలాలను పోలీసులు మరోసారి అడిగి తెలుసుకున్నారు. విక్రమ్‌గౌడ్‌ను ఒక్కరోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఈ విచారణలో కొత్త విషయాలేవీ రాబట్టలేదని తెలిసింది. విక్రమ్ కస్టడీ బుధవారం మధ్యాహ్నానికే ముగిసింది.

Pages