S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/12/2017 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన జాతీయ రహదారుల పనులు నత్తనడక నడుస్తున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. గత సంవత్సరం కేంద్రం అనుమతించిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేసిన ఐదు రాష్ట్ర రహదారుల పనుల జాప్యం పై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/12/2017 - 02:37

హైదరాబాద్, ఆగస్టు 11: దేశంలో ఆర్ధికాభివృద్ధి గతంతో పోలిస్తే కొంత పెరిగినా, అది లక్ష్యాలకు అనుగుణంగా పెరగలేదని, దాని వల్ల ఉపాధి అవకాశాలపైనా ప్రభావం పడిందని మాజీ గవర్నర్, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ సలహాదారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ సి రంగరాజన్ పేర్కొన్నారు.

08/12/2017 - 02:35

హైదరాబాద్, ఆగస్టు 11: గోల్గొండ కోటలో ఆగస్టు 15వ తేదీ మంగళవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గురించి అధికారులతో సమీక్షించారు. ఈ వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

08/12/2017 - 02:32

హైదరాబాద్, ఆగస్టు 11: నేరెళ్ళ ఘటనలో సిరిసిల్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని, ఎస్‌సిలను అనాగరికంగా హింసించిన పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని అఖిలపక్ష బృందం రాష్ట్ర డిజిపిని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ.

08/12/2017 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 11: మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవాల సందర్భంగా ఆయన రచనలపై రెండు రోజుల పాటు సమగ్ర సాహితీ సమాలోచనం జరగనుంది. శనివారం నాడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనూ, ఆదివారం నాడు శ్రీహరి విజయం పేరిట రవీంద్రభారతిలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

08/12/2017 - 01:51

హైదరాబాద్, ఆగస్టు 11: ఈ నెల 16న వరంగల్ జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్కుకు సిఎం కెసిఆర్ శంకుస్ధాపన చేయనున్నారు. వరంగల్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ పార్క్ వల్ల స్థానికులకు ఉద్యోగాలు, నేతన్నకు ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సిఎం శంకుస్థాపన చేస్తారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ-సంగెం మండలాల మధ్య రూ.1150 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

08/12/2017 - 01:50

హైదరాబాద్, ఆగస్టు 11: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు 15 జిల్లాల్లో కాలుష్య నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈ వివరాలను సేకరించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు అందిస్తారు.

08/12/2017 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 11: తాను టిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతానని కొందరు తనపై దుప్ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తానంటే గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదని శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.

08/12/2017 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ డీసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం నాడు ముగిసింది. డీసెట్‌లో అర్హులైన అభ్యర్థుల సర్ట్ఫికేట్లను జిల్లా స్థాయిలో పరిశీలించగా 17,285 మంది తుది అర్హత పొందారు. 7760 సీట్లకు గానూ 15,834 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా వారిలో 7119 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలు వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు.

08/12/2017 - 01:48

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి)కి ‘నేషనల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ 2017’ అవార్డు లభించింది. దేశంలోనే తొలిసారిగా టిఎస్‌ఆర్‌టిసి ప్రవేశపెట్టిన ‘వజ్ర’ ప్రయాణికుల ముంగిట్లోకే బస్ సర్వీస్ విధానం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

Pages