S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/02/2017 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 1: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. విక్రమ్‌గౌడ్ కాల్పుల ఘటన మిస్టరీని ఛేదించారు. పథకం ప్రకారమే కాల్పుల డ్రామా జరిగినట్టు పోలీసుల విచారణలో స్పష్టమైంది. గత నెల 28న విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పబ్‌ల నిర్వహణ, సినీ నిర్మాతగా విక్రమ్‌గౌడ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.

08/02/2017 - 04:35

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఎత్తి పోతల పథకాలకు అవసరం అయిన విద్యుత్ కోసం విద్యుత్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎత్తి పోతల పథకాలకు 12,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అని అంచనా వేశారు. దీనికి అవసరం అయిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

08/02/2017 - 02:13

హైదరాబాద్, ఆగస్టు 1: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీస్ శాఖలు నెగెటివ్ పాయింట్ల విధానాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టకుండా, ప్రతి తప్పిదానికి నిర్దేశిత నెగెటివ్ పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే..లైసెన్సు రద్దు చేయనున్నారు.

08/02/2017 - 02:11

హైదరాబాద్/ఆమనగల్లు, ఆగస్టు 1: అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి తనయుడు, తన స్నేహితులతో కలసి టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగడమే కాకుండా, టోల్‌గేట్ రుసుము చెల్లించకుండా కత్తులతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో సంచనం సృష్టించింది.

08/02/2017 - 02:09

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో పట్టణ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. ఈ మేరకు సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదం తెలిపిందని అన్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఆమెతో పాటు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, పాఠశాల విద్య సంచాలకుడు కిషన్, తదితరులు పాల్గొన్నారు.

08/02/2017 - 02:09

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవి ఆగస్టు 4వ తేదీన ఖాళీ అవుతుండటంతో 20 మంది విద్యానిపుణులు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించారు. వైస్ ఛాన్సలర్ హోదాలో పనిచేసిన వారు లేదా సీనియర్ ప్రొఫెసర్‌కు మాత్రమే ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవిలో నియమించే సంప్రదాయాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం సడలించి ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని చైర్మన్‌గా నియమించింది.

08/02/2017 - 02:08

హైదరాబాద్, ఆగస్టు 1: సిరిసిల్ల ఘటనలో టిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి, టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ను తూర్పారబట్టారు. సిరిసిల్లలో దళితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తే, నలుగురు దళితులే కదా?

08/02/2017 - 02:08

హైదరాబాద్, ఆగస్టు 1: రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు 16,105 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, కార్యదర్శి పార్థసారథి తెలిపారు. దీంతో 35 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందని ఆయన చెప్పారు. శిక్షణ పొందుతున్న ఐఎఎస్‌లు డాక్టర్ సచిన్, యోగిందర్ సింగ్, అషికా జైన్ మంగళవారం సచివాలయంలో పార్థసారథిని కలిసారు.

08/02/2017 - 02:06

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణ చేయకుంటే తెలంగాణలో బిజెపి నాయకులను తిరగనివ్వమని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వౌన దీక్ష నిర్వహించారు.

08/02/2017 - 02:04

హైదరాబాద్, ఆగస్టు 1: మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైదరాబాద్ హై కోర్టులో రఘునందన్‌రావు పిటీషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మూడు వారాల్లో కోర్టుకు సమర్పించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమేష్ రంగనాథన్ జస్టీస్ ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌రావును ఆదేశించింది.

Pages