S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/03/2017 - 23:33

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రభుత్వం విడుదల చేసే నిధులను వినియోగించేందుకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన అధికారులకు ఉన్న పరిమితులు, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుని నిధుల వినియోగం పరిమితిని ఎంత మేరకు పెంచవచ్చో పరిశీలించి, సిఫార్సులు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం గురువారం నియమించింది.

08/03/2017 - 23:32

హైదరాబాద్, ఆగస్టు 3: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మూడవ స్టూడెంట్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్‌లో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి తిరుపతి నాయక్ జూడో క్రీడల విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించినందుకు తెలంగాణ టూరిజం, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పథకాలు సాదించటమే లక్ష్యంగా సాగాలని కోరారు.

08/03/2017 - 23:31

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ పథకాల కింద ఇస్తున్న ఆర్థిక సాయానికి సంబంధించి చెక్కులను పెళ్లికూతురు తల్లిపేరుతో ఇస్తున్నారు. తల్లితండ్రి లేని అమ్మాయిలకు ఇచ్చే డబ్బును విడుదల చేసేందుకు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లాకలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గత రెండేళ్ల నుండి ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.

08/03/2017 - 02:41

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పనులు పుంజుకోవడం, కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, వర్షాలు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినిమయం ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఇంత పెద్ద పరిణామంలో విద్యుత్ వినిమయం జరగడం ఇదే తొలిసారి.

08/03/2017 - 02:40

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్రంలో గత ఐదారు రోజుల నుండి వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలు వేసే సాధారణ విస్తీర్ణం 110 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 80 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఇప్పటి వరకు విత్తనాలు వేసిన రైతుల పొలాల్లో ప్రస్తుతం పంటలు పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి.

08/03/2017 - 02:40

హైదరాబాద్, ఆగస్టు 2: డ్రగ్స్ కేసు నేపథ్యంలో రామానాయుడు సినీ స్టూడియోలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. విదేశాల నుంచి రామానాయుడు స్టూడియోకు వచ్చే పార్శిల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిఘా వేసింది. స్టూడియోకు విదేశాల నుంచి వచ్చిన ఒక పార్శిల్‌ను ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కనకదుర్గ స్వయంగా వెళ్లి పరిశీలించారు.

08/03/2017 - 02:39

హైదరాబాద్, ఆగస్టు 2: మాదకద్రవ్యాల కేసులో సినీ ప్రముఖులను విచారించడం బాధాకరమని, విచారణ జరిగిన పది రోజులు పరిశ్రమకు చీకటి రోజులుగా మారాయని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది.

08/03/2017 - 02:39

హైదరాబాద్, ఆగస్టు 2: విక్రమ్‌గౌడ్ మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడే కాదు. తెలివితేటలు తండ్రిని మించినవే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరిక ఆయనది. విజయానికి ప్రజల ఆదరణ కావాలి. దీనికి తోడు మైనింగ్ వ్యాపారంలో నష్టం, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియర్ల ఒత్తిడి నుంచి బయటపడాలి. ఇందుకు ఆయనకు సూపర్ ఆలోచన వచ్చేసింది. ‘అతడు’ సినిమా గుర్తొచ్చింది.

08/02/2017 - 04:27

హైదరాబాద్, ఆగస్టు 1: మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు మంగళవారం నటుడు నందు అలియాస్ ఆనంద కృష్ణను విచారించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటుడు నందు సిట్ కార్యాలయం ఆవరణలోని అమ్మవారి ఆలయంలో పూజ చేసి కార్యాలయం లోనికి వెళ్లారు. నందుతోపాటు అతని తండ్రి సిట్ కార్యాలయానికి వచ్చారు.

08/02/2017 - 03:24

హైదరాబాద్, ఆగస్టు 1: దేశంలో ఉపాధ్యాయ విద్యకు కొత్త రూపాన్ని ఇవ్వనున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఎంపి సి మల్లారెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రైవేటు బిఇడి, డిఇడి కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మంగళవారం నాడు కేంద్ర మంత్రిని కలిసి ఉపాధ్యాయ విద్యా కళాశాలల నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు.

Pages