S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/04/2017 - 03:00

నల్లగొండ, జూలై 3: దొండకాయ క్వింటాలుకు 100 రూపాయలకు పడిపోవడంతో పెట్టుబడులురాక ఒకవైపు, సాగు పందిళ్లకు ప్రభుత్వ సబ్సిడీ అందక ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన దొండ రైతులు ఆగ్రహంతో ఆందోళన బాట పట్టారు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలానికి చెందిన దొండ రైతులు మూకుమ్మడిగా తరలివచ్చి రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు.

07/04/2017 - 02:57

గజ్వేల్, జూలై 3: సీమాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు సిఎం కెసిఆర్ చేయూతనివ్వడంతో ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు.

07/04/2017 - 02:49

హైదరాబాద్, జూలై 3: హరిత హారం కోసం కోట్లాది మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. ఈసారి పెద్ద ఎత్తున పూల మొక్కలు, ఔషధ మొక్కలు కూడా హరిత హారంలో నాటనున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 12న కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటి ప్రారంభిస్తారు. నాలుగేళ్లలో మొత్తం 240 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం. మూడవ విడత హరిత హారంలో 40 కోట్ల మొక్కలు నాటనున్నారు.

07/04/2017 - 02:46

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్‌లో ఘనంగా బోనాలు నిర్వహించారు. సికిందరాబాద్‌లో జరుపుకునే విధంగానే సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి, డప్పులతో ఈస్ట్ హోం పట్టణంలో బోనాల పండుగ జరిపారు. తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు వెదురు బద్ధలు, రంగుకాగితాలతో తయారు చేసిన తొట్టెలను ఊరేగించారు.

07/04/2017 - 02:44

హైదరాబాద్, జూలై 3: మహిళల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని కఠినతరం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అనురాగ్ శర్మ తెలిపారు. ‘మహిళల రక్షణ’పై చర్చించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో (హోటల్ తాజ్ దక్కన్) సదస్సు జరిగింది.

07/04/2017 - 02:41

హైదరాబాద్, జూలై 3: హైదరాబాద్‌లో భారీగా దొరికిన డ్రగ్స్ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక సిట్ (స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం)ను ఏర్పాటు చేసింది. ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన సిట్ డ్రగ్స్ దందాపై ఆరా తీయనుంది. సినీ రంగంలో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వినియోగిస్తున్న సినీ ప్రముఖులే వ్యాపారులుగా మారినట్టు పోలీస్ అధికారులు గుర్తించారు.

07/04/2017 - 02:35

హైదరాబాద్, జూలై 3: మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకుని వేగంగా పనులు సాగిస్తున్న చనాకా కొరాటా బ్యారేజి నుంచి జనవరి 1 నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఐదునెలల్లో బ్యారేజీ పూర్తయ్యే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తొలి విడత ఈ బ్యారేజీ నుంచి పదివేల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. పంప్ హౌజ్ పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.

07/04/2017 - 02:26

హైదరాబాద్, జూలై 3: రాఘవాచార్యుల గురించి పెరియాళ్వార్ మళ్లీ పుట్టారా అన్నట్టుగా పెరియాళ్వార్ నక్షత్రాన ‘రాఘవీయం’ ఆష్కరణ భగవత్ సంకల్పమని దేవనాద జియర్ స్వామీజీ అన్నారు. తిరుమల చారిటబుల్ ట్రస్ట్, సత్కళా భారతి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ‘రాఘవీయం’ గ్రంథాన్ని స్వామీజీ ఆవిష్కరించారు.

07/04/2017 - 02:22

హైదరాబాద్, జూలై 3: నీట్ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్ధులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అభినందించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెదన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ చదివి 84 మంది విద్యార్ధులు నీట్‌లో మంచి ర్యాంకులు సాధించారు. ఇందులో 55 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ అభ్యర్ధులకు ఎంబిబిఎస్‌లోనూ, మరో 15 మంది ఎస్సీ, 5 మంది ఎస్టీ అభ్యర్ధులకు బిడిఎస్‌లో సీట్లు వచ్చే అవకాశం ఉంది.

07/04/2017 - 02:21

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కలెక్టరేట్ల భవనాల నిర్మాణం కోసం 962 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ఈ భవనాల నిర్మాణం యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. కలెక్టర్లకు పంపించిన ఆదేశాల్లో కలెక్టరేట్ల భవన నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సూచించారు.

Pages