S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/15/2016 - 13:48

హైదరాబాద్: భక్తుల కోలాహలం నడుమ గణపయ్య ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. తక్కువ సమయంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఇదే తొలిసారి. ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌నెంబర్ 4వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరుగనుంది. సాయంత్రంలోగా మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉంది.

09/15/2016 - 13:21

హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు తెలంగాణ సర్కారు నిర్వహించిన ఎంసెట్-3 పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన మానస టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. గుడివాడకు చెందిన రాగళ్ల మానస 152 మార్కులతో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది.

09/15/2016 - 12:59

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ర్యాంకులను tseamcet.inలో పొందవచ్చు. బుధవారం సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎంసెట్ కమిటీ వాటిని పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేయాలని భావించినా సాధ్యం కాలేదు. అభ్యంతరాలు ఎక్కువ మొత్తంలో రావడంతో ఫైనల్ కీని విడుదల చేయలేదు.

09/15/2016 - 11:51

హైదరాబాద్‌ : గణేశ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్‌ ఉంటాయని హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు తెలిపారు. బంద్‌ నుంచి స్టార్‌ హోటళ్లలోని బార్లకు మినహాయింపు ఉంది. శుక్రవారం సాయంత్రం 6గంటల తర్వాత మద్యం దుకాణాలు యఽథావిధిగా తెరుచుకోనున్నాయి.

09/15/2016 - 11:48

మహబూబ్‌నగర్‌: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జూరాల రిజర్వాయర్‌లో వరద నీరు పెరుగుతోంది. జూరాలలో ప్రస్తుత నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 9 వేల క్యూసెక్కులు ఉండగా, 3230 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

09/15/2016 - 11:26

హైదరాబాద్: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద గురువారం ఉదయం నిమజ్జనం కోలాహలం ఊపందుకుంటోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిమజ్జనంలో అందరూ పాల్గొంటున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ బొజ్జ గణపయ్యలు శోభాయమానంగా వూరేగేందుకు సిద్ధమయ్యారు. ఈఏడాది ఖైరతాబాద్ గణేశుడు మొదటగా నిమజ్జనం అవుతుండటంతో పోలీసులు రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు.

09/15/2016 - 11:21

హైదరాబాద్‌: గురువారం ఉదయం బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో మొత్తం 25 మంది పాల్గొనగా- రికార్డు స్థాయిలో రూ.14.65లక్షలకు స్కైలాబ్‌రెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్‌ లడ్డూ రూ.10.32 లక్షలు పలికింది. బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం పాట ప్రక్రియ 1980లో ప్రారంభమైంది.

09/15/2016 - 08:28

ఆదిలాబాద్, సెప్టెంబర్ 14: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా బుధవారం జిల్లాలో 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా చెరువులు, జలాశయాలకు వరదనీరు వచ్చిచేరడంతో జలకళను సంతరించుకుంది. ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 952 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉండగా అంతకుమించి 960 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

09/15/2016 - 08:37

వరంగల్, సెప్టెంబర్ 14: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయసేకరణ, అభ్యంతరాలన్నీ బూటకమేనని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గత నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ముసాయిదా విడుదల చేస్తూనే ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌లో ఫిర్యాదు చేయాలని సిఎం చెప్పినప్పటికీ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలైనట్టు తెలుస్తోంది.

09/15/2016 - 07:24

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో న్యాయాధికారుల సెలవులను ఆమోదించే అధికారాన్ని జిల్లా ప్రిన్సిపల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికే తిరిగి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టును విభజించాలని కోరుతూ న్యాయాధికారులు ఆందోళన చేసిన విదితమే. ఈ నేపథ్యంలో న్యాయాధికారుల సెలవులను ఆమోదించే అధికారం హైకోర్టు స్వీకరించింది.

Pages