S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/07/2017 - 02:11

హైదరాబాద్, జూలై 6: ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి నిశితంగా విమర్శించారు.

07/07/2017 - 02:10

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రప్రభుత్వం పాల్పడిన అవకతవకలపై కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందనే భయంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్ధి కోవింద్‌కు టిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది యుపిఏ అభ్యర్ధి మీరాకుమార్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు.

07/07/2017 - 02:10

న్యూఢిల్లీ, జూలై 6: గద్వాల- మాచెర్ల రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఎల్లయ్య గురువారం తెలంగాణకు చెందిన పలువురు విధాన మండలి సభ్యులతో కలిసి గురువారం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కలిసి గద్వాల-మాచెర్ల రైల్వే లైన్ నిర్మాణం గురించి చర్చించారు.

07/07/2017 - 02:09

హైదరాబాద్, జూలై 6: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం అద్భుతంగా ఉందని కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రసంశించారు. నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మోహిత్‌వర్మ, ప్రశాంత్ మిట్టల్, అజయ్ మోర్‌లు భేటీ అయ్యారు.

07/07/2017 - 02:08

కొడంగల్/వికారాబాద్, జూలై 6: మందలించాడని కన్న తండ్రిపైనే దాడికి పాల్పడ్డాడు ఓ తనయుడు. కని..పెంచి.. పోషించిన తండ్రిని వృద్ధుడని కూడా కనికరించకుండా కత్తితో అతి దారుణంగా పొడిచి చంపిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నరుూం ఖాన్(70) ఎండు మిర్చి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.

07/07/2017 - 02:08

హైదరాబాద్, జూలై 6: ఎరువులపై జిఎస్‌టిని తగ్గించిన విషయాన్ని రైతులు అందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయశాఖ కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఎరువులప 12 శాతం జిఎస్‌టి ఉండగా దానిని 5 శాతానికి తగ్గించిందన్నారు. తగ్గించిన విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

07/07/2017 - 02:07

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీల ప్రతినిధులతో శుక్రవారం నాడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి సంబంధించి వెలుగు చూసిన వివిధ ఉన్నత విద్యాసంస్థలపై చర్యలకు, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణను రూపొందిస్తారు.

07/06/2017 - 03:15

హైదరాబాద్, జూలై 5: రాష్ట్రంలో కొత్తగా మూడు నగరాభివృద్ధి సంస్థల(యుడిఏ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థతో పాటు వరంగల్ నగరానికి కాకతీయ నగరాభివృద్ధి సంస్థ మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు కూడా నగరాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం నిర్ణయించారు.

07/06/2017 - 03:15

న్యూఢిల్లీ, జూలై 5: తెలంగాణలో మరో 16 మార్కెట్లలో ఈ-నామ్‌ను అమలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ కిందకు తీసుకొచ్చే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ అభినందించారు.

07/06/2017 - 03:14

హైదరాబాద్, జూలై 5: సరోగసీ (అద్దె గర్భం)పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అద్దె గర్భం పేరిట అమాయక, పేద మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేందుకు నడుం బిగించింది. ఈ సమస్యను శాశ్వతంగా నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కమిటీని నియమిస్తూ జీవో (నెం.608) జారీ చేసింది.

Pages