S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2017 - 03:14

మిర్యాలగూడ, జూన్ 19: పేదలకు ఉచిత వైద్యసేవలు విస్తృతం చేయాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన టికెవి.రంగాచార్యాలు, రంగనాయకమ్మ లయన్ కంటి ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు.

06/20/2017 - 03:13

కరీంనగర్, జూన్ 19: ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తోందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు ఆరోపించారు.

06/20/2017 - 03:12

పటన్‌చెరు, జూన్ 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేసారు. బడుగు బలహీనవర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సోమవారం మంత్రి ప్రారంభించారు.

06/20/2017 - 03:12

వీపనగండ్ల, జూన్ 19: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని వెలగొండ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... వీపనగండ్ల గ్రామం నుంచి విద్యుత్ స్తంభాలు తీసుకొని వెలగొండ గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

06/20/2017 - 03:11

సుల్తానాబాద్, జూన్ 19: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మినీ మైక్రో టవర్‌పై పిడుగు పడింది. దీంతో సిగ్నల్ సిస్టమ్ ఆగిపోవడంతో దాదాపు ఆరు గంటల పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఇతర గూడ్స్ రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

06/20/2017 - 03:11

ఆదిలాబాద్,జూన్ 19: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 37 మంది కానిస్టేబుళ్ళు భోజనం వికటించి వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన అలజడి సృష్టించింది. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ సీరియస్‌గా స్పందించి, మెస్ ఇన్‌చార్జిని విధుల నుండి తొలగించగా జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే...

06/20/2017 - 02:52

న్యూఢిల్లీ, జూన్ 19: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు తెలంగాణ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కించుకుంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

06/20/2017 - 02:50

హైదరాబాద్, జూన్ 19: ఈ నెల 23న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కు రానున్నారు. శిల్పకళా వేదికలో ఎన్‌ఆర్‌ఐ సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్ట్రాటెజిక్ అలయెన్స్ (జిఎస్‌ఎ) వరల్డ్ డివైన్ కాంగ్రెస్‌ను రాష్టప్రతి ప్రారంభిస్తారు. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రాష్టప్రతి చేరుకుంటారు.

06/20/2017 - 02:49

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ జెఎసి ఈ నెల 21న సిద్దిపేటలో ‘అమరుల స్ఫూర్తి యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నది. ఆ రోజున ఉదయం 7 గంటలకు నగరంలోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమర వీరుల స్థూపం వద్ద టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రభృతులు అమర వీరులకు నివాళి అర్పిస్తారు. అనంతరం వారు సిద్దిపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రారంభమై 24వ తేదీ వరకు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కొనసాగుతుంది.

06/20/2017 - 02:49

హైదరాబాద్, జూన్ 19: అద్దెగర్భంతో పిల్లలకు జన్మనిచ్చేందుకు సహకరిస్తున్న బంజారాహిల్స్‌లోని సాయికిరణ్ ఆసుపత్రిపై వైద్యాధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు. సాయికిరణ్ ఆసుపత్రిలో గత మూడేళ్లుగా సరోగసీ దందా కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

Pages