S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2017 - 04:35

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 25: నాగార్జునసాగర్‌ను శనివారం అంతర్జాతీయ బౌద్ధ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈనెల 23నుండి 26వరకు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లో అంతర్జాతీయ తెలంగాణ బౌద్ధ వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 16 దేశాల నుండి బౌద్ధ ప్రతినిధులు, బౌద్ధ భిక్షువుల హాజరయ్యారు.

02/26/2017 - 04:35

వేములవాడ, ఫిబ్రవరి 25: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ముగిశాయి. జాతరకు వచ్చిన భక్తలు శనివారం తిరుగుముఖం పట్టారు. చల్లంగా చూడు... మళ్లీయేటికి వస్తామంటూ ఆ మహాదేవున్ని శ్రమజీవులు, గిరిజనులు, అన్నదాతలు వేడుకుంటూ తమ స్వగ్రామాలకు పయనమయ్యారు.

02/26/2017 - 04:34

పాపన్నపేట, ఫిబ్రవరి 25: ఏడుపాయల వనదుర్గామాత జాతర ఉత్సవాలు రెండవ రోజైన శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. శకటభ్రమణోత్సవం, ఎడ్లబండ్ల ఊరేగింపు ప్రధాన అకర్షణగా నిలిచాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిలకించారు.

02/26/2017 - 04:32

మహబూబాబాద్, ఫిబ్రవరి 25: తమ పార్టీని, నాయకులను చీప్‌లిక్కర్‌తో పోల్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ది గుడుంబా పార్టీనా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పోరిక బలరాంనాయక్ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

02/26/2017 - 04:01

హైదరాబాద్, ఫిబ్రవరి 25: సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని, ఆపన్నులకు పెద్ద పీట వేస్తున్నారని అందుకే ప్రధానిని పేదల పెన్నిధిగా ప్రజలు భావిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో బిజెపి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

02/26/2017 - 03:58

హైదరాబాద్/సైదాబాద్, ఫిబ్రవరి 25: జైలులోని ఖైదీలను కుటుంబ సభ్యులు, బంధువులు కలుసుకునేందుకు వీలుగా తెలంగాణ జైళ్లశాఖ ఈ-ములాఖత్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఖైదీల బంధువులు, స్నేహితుల కోసం రాష్ట్రంలో మొదటిసారిగా చంచల్‌గూడ జైలులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ-ములాఖత్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జైళ్లశాఖ డిజి వికె సింగ్ శనివారం ప్రారంభించారు.

02/26/2017 - 03:56

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టడం పెద్దపనేమీ కాదని, తాము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు.

02/26/2017 - 03:52

వరంగల్, ఫిబ్రవరి 25: వరంగల్ అర్బన్ జిల్లా సిపిఎం నాయకుల మద్య ఏర్పడిన విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే టివి ఛానెల్ కోసం ఇచ్చిన డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పార్టీ కార్యకర్తలు కొందరు శుక్రవారం పార్టీ నాయకులపై దాడిచేయగా, శనివారం ఏకంగా పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయ తలుపులు, కిటికీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

02/26/2017 - 02:07

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ జూలై నాటికి పూర్తి చేసి ఖరీఫ్‌కు సాగునీరు అందించాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. చనాకా- కొరటా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.

02/26/2017 - 02:06

హైదరాబాద్, ఫిబ్రవరి 25: నిరుద్యోగ నిరసన ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా భగ్నం చేసినప్పటికీ, తాము ఓడిపోలేదని, ద్విగుణీకృత ఉత్సాహంతో మరింత దూసుకుని వెళ్ళాలని తెలంగాణ జెఎసి భావిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల్లోనూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ, వారికి చేరువ కావాలని నిర్ణయించింది. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.

Pages