S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/29/2019 - 01:26

హైదరాబాద్: మరిన్ని అద్దె బస్సులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో పా టు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే రూట్ల ప్రైవేటీకరణకు విధివిధానాలను రూపొందించాలని కూడా చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ

10/29/2019 - 01:24

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి ప్రధాన ఆలయానికి ప్రారంభోత్సవం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆ సందర్భంగా యాదాద్రిలో 1,008 కుండలతో మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

10/27/2019 - 05:05

కర్నూలు, అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల వైఫల్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చిన్నచిన్న సమస్యల పరిష్కారంలో సైతం తీవ్ర జాప్యం చేస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు.

10/27/2019 - 05:05

హైదరాబాద్, అక్టోబర్ 26: చర్చల ద్వారా ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మొండిపట్టు వీడి సానుకూల చర్చల ద్వారా సమ్మెను పరిష్కరించాలని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

10/27/2019 - 05:03

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్టీసీ సంఘాల నేతలను చర్చలకు పిలవాలని కోరుతూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఉపాధ్యాయులు, ఇతర సంఘాల నేతలు సంఘీభావం తెలపాలని ఆయన సూచించారు.

10/27/2019 - 04:59

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్ధాంతరంగా చర్చలు ముగియడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. హైకోర్టు స్ఫూర్తిని తుంగలో తొక్కారని, సమస్యను జటిలం చేశారలని, సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనిపించడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

10/27/2019 - 04:45

నాగార్జునసాగర్, అక్టోబర్ 26: నాగార్జునసాగర్‌లో శనివారం నాడు సైతం డ్యాం గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం నుండి సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 8 గేట్ల ద్వారా మాత్రమే దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,67,014 క్యూసెక్కులు వస్తుండగా సాగర్‌లో 589.70 అడుగులుగా ఉంది.

10/27/2019 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 26: మహబూబ్‌నగర్ జిల్లా గూడూరులో ఉన్న జడ్పీ బాలికల పాఠశాల విద్యార్థినుల సమస్యలపై జిల్లా కలెక్టర్ విచారించి నివేదక ఇవ్వాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ఆదేశించింది. ఈ పాఠశాలలో విద్యార్థినులు 130 మంది ఉన్నారు. వీరికి ఒక టాయిలెట్ మాత్రమే ఉంది. ఈ సమస్యపై స్పందించిన కేంద్ర హోంశాఖ కార్యాలయం వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

10/27/2019 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 26: పశువైద్య, పశు సంవర్థక శాఖ డైరెక్టరేట్‌ను ఈ-ఆఫీస్‌గా మార్చారు. ఈ-ఆఫీస్‌ను ఈ శాఖ డైరెక్టర్ డాక్టర్ వి. లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సమర్థవంత పాలనను, సమర్థ సేవలను అందించాలన్న లక్ష్యంతో జాతీయ ఈ-పాలన ప్రణాళిక (ఎన్‌ఈజీపీ) లో భాగంగా మిషన్ మోడ్ ప్రాజెక్టు (ఎంఎంపీ) గా దీన్ని ప్రవేశపెట్టారు.

10/27/2019 - 04:43

హైదరాబాద్, అక్టోబర్ 26: హుజూర్‌నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. తమ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతగా టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలా కనపడలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్, తాజాగా మరి కొన్ని హామీలను ప్రజలకు ఇచ్చారన్నారు. కేసీఆర్ హామీల్లో విశ్వసనీయత లేదన్నారు.

Pages