S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/26/2019 - 00:46

హైదరాబాద్, అక్టోబర్ 25: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి బంపర్ మెజారిటీ సాధించినందుకు అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. శ్రీనివాసరెడ్డి బాగా కష్టపడ్డారని, అందుకే మంచి మెజారిటీ వచ్చిందని ఆయన అభినందించారు.

10/26/2019 - 00:46

హైదరాబాద్, అక్టోబర్ 25: పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు శుక్రవారం ఇక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్టీసీ సమ్మె, ప్రజలు బాధపడుతున్న బాధలు, ప్రభుత్వ పనితీరును వివరించినట్లు వీహెచ్ చెప్పారు.

10/26/2019 - 00:45

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ సంరక్షణ , కార్మికులకు వేతనాలు రావాలని, కార్మిక వర్గాలు, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ డిమాండ్లతో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద శనివారం నుండి నిరవధిక నిరాహారీ దీక్షకు దిగనున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

10/26/2019 - 00:45

హైదరాబాద్, అక్టోబర్ 25: వరంగల్‌కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కేఎస్‌ఆర్‌బీ. ప్రసాద్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన గత స్మృతులు ఎప్పటికీ మరువలేనవని ఆయన పేర్కొన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు వినోద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

10/26/2019 - 00:44

హైదరాబాద్, అక్టోబర్ 25: ఒకే నెలలో సింగరేణి కార్మికులు రెండు బోనస్‌లు అందుకోవడం సింగరేణి చరిత్రలోనే రికార్డు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా సింగరేణి తన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించింది. దీపావళి బోనస్‌గా రూ. 258 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఒక్కో కార్మికునికి లక్ష రూపాయలు అందచేశారు. దీనికి తోడుగా దీపావళి బోనస్ రూ.

10/26/2019 - 00:10

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆర్టీసీని ప్రైవేటీకరించడంతో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని ఈడీల అధ్యయన నివేదికలో స్పష్టంగా తేల్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఆర్టీసీపై మీడియాకు వివరించిన అంశాలనే ఈడీల అధ్యయన నివేదికలో పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా డ్యూటీలో శుక్రవారం ఎంతమంది కార్మికులు చేరారన్న అంశాలపై సీఎం ఆరా తీశారు.

10/26/2019 - 00:05

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఎన్నికలల జాబితాను ఈ ఏడాది జూలై 16వ తేదీన ప్రచురించామని పేర్కొంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాను కొలమానంగా వార్డుల వారీగా ఎన్నికల జాబితాను మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేశారని తెలిపింది.

10/26/2019 - 00:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: హుజూర్‌నగర్ శాసన సభ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి, తన భార్య పద్మావతీ రెడ్డి పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఆయన భార్య పద్మావతి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సైదారెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందటం తెలిసిందే.

10/25/2019 - 05:45

హైదరాబాద్, అక్టోబర్ 24: మున్సిపల్ ఎన్నికలకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నవంబర్ నెలాఖరు వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అయితే మరో సింగిల్ బెంచ్ వద్ద కూడా మరికొన్ని కేసులు ఉన్నాయన్నారు.

10/25/2019 - 05:37

హైదరాబాద్, అక్టోబర్ 24: హుజూర్‌నగర్ గెలుపు ఆషామాషీ కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లేసి అద్భుతమైన విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఈ విజయం ప్రభుత్వానికి ఓ టానిక్‌లాంటిదని అభివర్ణించారు. తెలంగాణ భవన్‌లో గురువారం హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారన్నారు.

Pages