S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/26/2019 - 00:55

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 25: శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు కొనసాగుతోంది. మహరాష్ట్ర, కర్నాటకలలో భారీ వర్షాలు కురవడంతో రికార్డు స్థాయిలో వరదనీరు వస్తోంది.

10/26/2019 - 00:55

డిండి, అక్టోబర్ 25: వేయి కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం లోని మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని రిజర్వాయర్‌లో 14.50 లక్షల చేపపిల్లలను వదిలిపెట్టారు.

10/26/2019 - 00:54

యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 25: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వానికి ఏమి నష్టమో చెప్పకుండా ఆర్టీసీని ప్రయివేటు పరం చేయడానికి కుయుక్తులు పన్నుతూ కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

10/26/2019 - 00:50

హైదరాబాద్, అక్టోబర్ 25: తనపై కేసులు నమోదు చేయిస్తున్న వ్యక్తుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం జేఏసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అబద్దాలు చెప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం అని అన్నారు.

10/26/2019 - 00:50

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కార బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఆర్టీసీ సమ్మె పట్ల ముఖ్యమంత్రి అసహనంతో వ్యవహరించడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆర్టీసీ ఉండదు అని చెప్పడం కార్మికులను బెదిరించడం తప్ప మరొకటి కాదని అన్నారు.

10/26/2019 - 00:49

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే నియంతృత్వం ధోరణి గుర్తు చేస్తోందని టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చకుండా వారిపై అభాండాలు వేయడం వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

10/26/2019 - 00:49

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను పరిష్కరించమని ప్రభుత్వాన్ని ఆదేశించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ట్రేడ్ యూనియన్ల సంఘాల నేతలు శుక్రవారం నాడు కోరారు.

10/26/2019 - 00:48

హైదరాబాద్, అక్టోబర్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మితిమీరిన మాటలు మాట్లాడారని, ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి వచ్చే కార్మిక సమస్యలను పనికిమాలిన పనులు అనడం సమంజసం కాదన్నారు. చర్చలకు పిలవాల్సిన వ్యక్తే నోటికి వచ్చినట్లు మాట్లాడడం అహంభావానికి నిదర్శనమన్నారు.

10/26/2019 - 00:47

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో గ్రామీం ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషీ ఆదేశింరు. శుక్రవారం ఇక్కడ ఆయన బీఆర్‌కే భవన్‌లో కీటక జనిత వ్యాధులపై ప్రత్యేక సమీక్ష నిర్వహింరు.

10/26/2019 - 00:47

హైదరాబాద్, అక్టోబర్ 25: ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పించే విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిబంధనలను పాటించనందు వల్ల తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.

Pages