S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/31/2019 - 01:36

హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో రోజుకో కొత్త అవినీతి కోణం వెలుగు చూసింది. ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించి వివిధ కిట్ల కొనుగోళ్లను పరిశీలించింది. మెడికల్ కిట్ల కోసం పెట్టిన ఇండెంట్లలో గోల్‌మాల్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

10/31/2019 - 01:22

హైదరాబాద్: హైకోర్టుకు ప్రభుత్వం తరఫున నివేదించే అంశాలపై ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున హైకోర్టు లేవనెత్తిన అంశాలకు ఇవ్వాల్సిన సమాధానాలపై అధికారు లు, న్యాయాధికారులతో సీఎం చర్చించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణను నవంబర్ ఒకటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

10/31/2019 - 01:21

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకూ సమ్మె ఆగే ప్రసక్తే లేదని ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. సర్కారు దిగివచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. ‘ఆర్టీసీ పరిరక్షణ’ పేరుతో బుధవారం సరూర్‌నగర్ స్టేడియం లో జరిగిన ‘సకలజన భేరి’ సభ విజయవంతం అయింది. జేఏసీ నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఈ సభకు హాజరయ్యారు.

10/30/2019 - 17:36

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నల్గొండ, తిరుమలగిరి, దేవరకొండ, నిడమానూరు, మిర్యాలగూడ, దామరచర్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, సైదాపూర్, కేశవపట్నం, కమలాపూర్ మండలాల్లో వర్షం కురిసింది. వరి, మక్క పంటలు దెబ్బతిన్నాయి.

10/30/2019 - 17:31

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కారణంగా ఇప్పటివరకు 15మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఆయన సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఆర్టీసీ ‘సకల జనభేరీ’ సభలో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. స్వీయ క్రమశిక్షణ పేరుతో 48వేల మంది కార్మికులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

10/30/2019 - 17:30

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారంనాడు కోర్టుకు సమర్పించాల్సిన వివరాలపై అధికారులతో మాట్లాడారు. అలాగే సమ్మె వల్ల ఏర్పడుతున్న ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించటానికి చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన కూడా ఆయన సమీక్ష జరిపారు. కోర్టుకు సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

10/30/2019 - 05:31

హైదరాబాద్: హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కలు బోగస్సు అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మంగళవారం విచారణ వాయిదా పడిన తర్వాత ఆశ్వత్తామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు ఆర్టీసీకి రూ.1099 కోట్లు బకాయి పడిందన్నారు.

10/30/2019 - 05:27

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆర్టీసీ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధ కాండ, అక్రమ అరెస్టులపై సీపీఐ నేతలు భగ్గుమన్నారు. కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ హైదరాబాద్ సమితి ఆధ్వర్యంలో మంగళవారం చలో డీజీపీ ఆఫీసు కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/30/2019 - 05:24

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో సకల జనుల సమరభేరీ జరగనుంది. సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు సభ జరుగనుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ సభకు అఖిల పక్ష నేతలతో పాటు ప్రజా సంఘాలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.

10/30/2019 - 05:23

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ. ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) మేజర్ జనరల్ ఆర్‌కే సింగ్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషితో సమావేశమయ్యారు. మేజర్ జనరల్ ఆర్‌కే సింగ్ సీఎస్‌తో పాటు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమం, భద్రత అంశాలు, ప్రభుత్వం-మిలటరీ మధ్య సంబంధాలపై చర్చించారు.

Pages