S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/30/2019 - 04:31

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణలో పురపాలక ఎన్నికల షెడ్యూల్ ఎప్పడు ప్రకటించినా, సమర్థతగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తుది ఆదేశాలు ఈ నెల 31 న వస్తాయని చెప్పారు.

10/30/2019 - 01:53

హైదరాబాద్, అక్టోబర్ 29: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేకుండా సమష్టిగా పోరాడేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.

10/30/2019 - 01:49

హైదరాబాద్, అక్టోబర్ 29: మహాత్మాగాంధీ ఆశయాల అమూల్యమైనవని, సత్యాగ్రహం, అహింసతో భారత దేశాన్ని విదేశీ దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసిన జాతిపిత అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన 150 కి.మీ చేపట్టిన సంకల్పయాత్రను ముగించారు.

10/30/2019 - 01:47

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు బుధవారం నాడు నిర్వహించతలపెట్టిన సకల జనుల సమరభేరి నిర్వహణకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సరూర్‌నగర్ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ సకల జనుల సమర భేరి నిర్వహించుకోవచ్చని, ఈ విషయం లో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో హైకోర్టు ఆమోద ముద్ర వేసింది.

10/29/2019 - 16:53

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు నవంబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసింది. సమ్మెపై విచారణ చేపట్టిన కోర్టు వివరాలు లేకుండా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అసమగ్రమైన నివేదిక సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నవంబర్ 31వ తేదీలోగా బకాయిల వివరాలు అందించాలని ఆదేశించింది.

10/29/2019 - 16:10

హైదరాబాద్: నగరాన్ని ఈరోజు భారీవర్షం ముంచెత్తింది. ఎల్బీనగర్, కాప్రా, నాగోల్, వనస్థలిపురం, మన్సురాబాద్, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్,జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వీధులన్నీ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది.

,
10/29/2019 - 05:52

హైదరాబాద్, అక్టోబర్ 28: పోలీసులు, న్యాయవ్యవస్థ ఒకే నాణానికి రెండు పార్శ్వాలని, ఇరువురి లక్ష్యం చివరికి న్యాయం చేయడమేనని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. రాజ్‌బహదూర్ వెంకట్రామ్‌రెడ్డి పోలీసు అకాడమీలో జరిగిన 2019-20 ఎస్‌సీటీ ఎస్‌ఐ (సివిల్) ప్రవేశ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

,
10/29/2019 - 05:47

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహార దీక్ష ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో తాను నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్టు కూనంనేని ప్రకటించారు.

10/29/2019 - 05:41

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే ఏడాది జరగనున్న ‘మేడారం’ సమక్క, సారాలమ్మ జాతరను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మేడారం జాతర నిర్వహణపై సోమవారం ఇక్కడి సంక్షేమ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

10/29/2019 - 05:29

హైదరాబాద్, అక్టోబర్ 28: ఈ సంవత్సరం యాసంగి, వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్లకు సంబంధించి విత్తనోత్పత్తిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సేద్యం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హాకాభవన్‌లో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి సరఫరా పుష్కలంగా ఉండటంతో వరిపంటతో పాటు ఇతర పంటల విస్తీర్ణం పెరిగిందన్నారు.

Pages