S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/21/2019 - 01:35

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఉత్తర్వుల ప్రతులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇనచార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.

10/21/2019 - 01:32

నల్లగొండ, అక్టోబర్ 20: రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిరేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జరుగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.

10/20/2019 - 05:21

మేళ్లచెర్వు, అక్టోబర్ 19: గత 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో నియంతపాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కోటా రామారావును గెలిపించాలని కోరుతూ శనివారం రోడ్‌షో నిర్వహించారు.

10/20/2019 - 05:19

నేరేడుచర్ల, అక్టోబర్ 19: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడానికే కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు.

10/20/2019 - 05:16

హైదరాబాద్,, అక్టోబర్ 19: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక సంఘాల నేతలతో విద్యుత్ అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు పోతామని కార్మిక సంఘాలు సూచించడంతో విద్యుత్ అధికారులు అప్రమత్తం అయ్యారు.

10/20/2019 - 05:13

గరిడేపల్లి, అక్టోబర్ 19 : హుజుర్‌నగర్ ఉప ఎన్నికలు సాదారణమైనివి కావని తెలంగాణలో స్వేచ్చకు...నిర్భందానికి మధ్య జరుగతున్న ఎన్నికలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడులో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

10/20/2019 - 05:06

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటమే గాక, నయా నిజాంను తలపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మండిపడ్డారు.

10/20/2019 - 04:54

వేములవాడ, ఆక్టోబర్ 19: ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో స్వామి వారి ప్రసాదంగా లభించే లడ్డుకు ప్రత్యేక మైన గుర్తింపు ఉంది. ఇటువంటి పవిత్రమైన ప్రసాదం తయారీ అధికారుల నిర్లక్ష్యపు వైఖరి వలన లడ్డు పవిత్రతను కోల్పోతుంది. శనివారం ఒక భక్త బృందం రాజన్నను దర్శించుకొని ప్రసాదాలను కొనుగోలు చేసి లడ్డూ తినే సమయంలో లడ్డూను విచ్చగా దానిలో తల వెంట్రుకలు దర్శనమిచ్చాయి. దీనితో భక్తులు ఆగ్రహించారు.

10/20/2019 - 04:52

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సముచిత ప్రాధన్యత కల్పించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం జూబ్లిహిల్స్‌లోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు.

10/20/2019 - 04:51

తుంగతుర్తి, అక్టోబర్ 19: కాస్త ఆలస్యమైనప్పటికీ అంతా అనుకున్నట్టే శ్రీరాంసాగర్ రెం దశ జలాలు కాలువల ద్వారా నిర్ణీత గమ్యం వైపు పయనించడానికి వడివడిగా పరుకులు పెడుతున్నాయి. ఇప్పటికే కాలువల ద్వారా నీటిసామర్ద్యం పెంపుతో ఉమ్మడి వరంగల్ జిల్లా మైలారం రిజర్వాయరును నింపుకొన్న జలాలు తాజాగా అదే జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగు రిజర్వాయరులోకి అడుగుపెట్టాయి.

Pages