S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/22/2019 - 04:16

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉంటారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులు నిబద్దత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని సీఎం తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అర్పిస్తున్నారన్నారు.

10/22/2019 - 01:26

వనస్థలిపురం (హైదరాబాద్): చిన్నపిల్లల ఆసుపత్రి ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాలుడు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో నలుగురు చిన్నారులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం పలు ఆసుపత్రులకు తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని ఆయా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

10/22/2019 - 01:21

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరో మూడు కొత్త పిటిషన్లు సోమవారం నాడు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాల జాక్ నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 29న తదుపరి విచారణ జరగనుంది. ఆర్టీసీ సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది.

10/22/2019 - 01:19

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఒకవైపు అరేబియా సముద్రంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడి ఉందని, మరోవైపు వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సో మవారం విడుదల చేసిన ఒక ప్రకన లో తెలిపారు.

10/22/2019 - 01:16

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ప్రగతిభవన్ ముట్టడి సోమవారం ఉద్రిక్తతలు, ఉరుకులు, పరుగులు, ఆరెస్టులతో ఆద్యంతం ఉత్కంఠగా జరిగింది. ప్రగతిభవన్ ముట్టడిని విఫలం చేయడానికి పోలీసులు ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు.

10/22/2019 - 01:13

నల్లగొండ, అక్టోబర్ 21: హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు..పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ప్రశాంతంగా సాగిన పోలింగ్‌లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఆయా కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 84.15 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, సూర్యాపేట కలెక్టర్ అమయకుమార్ తెలిపారు.

10/21/2019 - 12:49

హైదరాబాద్: స్కూళ్లు తెరుచుకోవటం, ఆర్టీసీ సమ్మె వల్ల సొంత వాహనాలు వినియోగిస్తుండటం వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో టాఫ్రిక్‌కు తీవ్ర జాప్యం జరిగింది. ప్రయాణీకులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక పోతున్నారు. ఎప్పుడూ రద్దీ లేని చోట కూడా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఈ భారీ ట్రాఫిక్ జాంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి స్కూళ్లకు, కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు.

10/21/2019 - 12:49

హైదరాబాద్: బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రగతి భవన్‌కు సమీపంలోనే బేగంపేట రైల్వేస్టేషన్ ఉండటం.. ఆందోళనకారులు అక్కడి నుంచి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేషన్‌ను అధికారులు మూసేశారని సమాచారం.

10/21/2019 - 12:48

హైదరాబాద్: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్కరణ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు పెద్దపీట వేసిందని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. రూ.400 కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ పూర్తిచేశామని తెలిపారు.

10/21/2019 - 12:47

హైదరాబాద్: తెలంగాణలోని హుజర్‌నగర్‌లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటలకు 31.34 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామ చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీచేస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు.

Pages