S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/21/2019 - 07:50

వరంగల్, అక్టోబర్ 20: ఆర్టీసీ సమ్మెపై రాజ్యాంగ సంక్షోభం తలెత్తకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని హన్మకొండ ఏకశిల పార్కులో కొనసాగుతున్న ఆర్టీసీ దీక్షా శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీ సమ్మె 15 రోజులు గడిచినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

10/21/2019 - 07:47

వనపర్తి, అక్టోబర్ 20: రాష్ట్రంలోని పేద ప్రజల కూతుళ్ల పెళ్లిళ్ల కోసం అప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయం అందజేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో వనపర్తి మండల పరిధిలోని 40 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

10/21/2019 - 07:43

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రగతిభవన్ ముట్టడి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గడువు ముగియడంతో ప్రగతిభవన్ ముట్టడించనున్నట్టు టీపీసీసీ ప్రకటించింది.

10/21/2019 - 07:41

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు.

10/21/2019 - 07:35

హైదరాబాద్, అక్టోబర్ 20: ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దోచిపెడుతున్నారని కాంగ్రెస్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని విమర్శించిన కేసీఆరే ఇప్పుడు వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని విమర్శించారు.

10/21/2019 - 07:31

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆర్టీసీ సమ్మెను బలోపేతం చేయడానికి ఈనెల 23న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటిలో నిర్వహించనున్న జేఏసీ బహిరంగ సభకు అనుమతులు రాకపోచ్చునని పోలీసు వర్గాలు తెలిపాయి. ఓయూ జేఏసీ విద్యార్థల మద్దతుతో సమ్మెను ఉధృతం చేయడానికి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 23న ఓయూలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని జేఏసీ కన్వీనర్ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే.

10/21/2019 - 07:31

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో 2019 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఈ సీజన్‌లో 55 లక్షల టన్నుల వరిధాన్యం మార్కెట్‌కు వస్తుందని తొలుత అంచనావేయగా, తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం 75 లక్షల టన్నుల వరిధాన్యం వస్తుందని భావిస్తున్నారు. రైతుల నుండి ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

10/21/2019 - 05:22

హైదరాబాద్, అక్టోబర్ 20: రైల్వే ప్రయాణ సమయంలో రైలు ఇంజనుకు అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇబ్బందులు పరిష్కరించుకోవడానికి రైల్వేలోకో పైలట్లకు హైటెక్ మాన్యువల్‌ను సమకూర్చుతున్నారు. కొత్త విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం నుంచి అమలు చేయనున్నారు. పైలట్లకు పని భారం తగ్గిస్తూనే. పని సామర్థ్యాన్ని పెంచేందుకు వారికి ఆండ్రాయిడ్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

10/21/2019 - 03:30

హైదరాబాద్ : హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘ఫార్మాసిటీ’కి కేంద్రం ఉదారంగా సాయం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కడ్తాల్ దగ్గర

10/21/2019 - 03:35

హైదరాబాద్: న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె పోరు ఆగబోదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాల నేతృత్వంలో ఈనెల 30న హైదరాబాద్‌లో ఐదు లక్షల మందితో సకల జనుల భేటీకి సన్నాహాలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆయన

Pages