S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/20/2019 - 04:34

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని నాడు నిరంకుశ నిజాం గస్తీ నిషాన్ పేరుతో అణచివేయాలని చూస్తే ప్రజలు ఎలా తిరగబడ్డారో, అదే రీతిన నేటి నిరంకుశ కేసీఆర్‌పైనా తిరగబడతారని సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాష్టబ్రంద్‌లో భాగంగా శనివారం నాడు ఎంజీబీఎస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో వామపక్ష పార్టీల ధర్నా జరిగింది.

10/20/2019 - 04:34

హైదరాబాద్, అక్టోబర్ 19: గత 15 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను నివారించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా, దానిని శాంతిభద్రతల సమస్యగా చూస్తూ నేడు యావత్ తెలంగాణ సమాజం శాంతియుతంగా తెలంగాణ బంద్ పాటిస్తుంటే అక్రమ అరెస్టుల ద్వారా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని టీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఫెడరేషన్ అధ్యక్షుడు ఇ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ పేర్కొన్నారు.

10/20/2019 - 03:40

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ శాఖలోని 3025 జూనియర్ లైన్ మెన్, జూనియర్ అసిస్టేంట్ తదితర ఉద్యోగాలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారం నుండి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలాచారి తెలిపారు. ఉద్యోగ ఖాళీలు ప్రకటించిన ఆయా జిల్లాల పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

10/20/2019 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. శనివారం ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన ఇంజనీరు, పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

10/20/2019 - 01:07

హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక మూడు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడం కోసం ఈ నెల 22న హైదరాబాద్‌లో కేంద్ర జల సంఘం సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరుకానున్నారు.

10/20/2019 - 01:06

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలతో శనివారం జరగాల్సిన ప్రభుత్వం చర్చలు జరగలేదు. కార్మిక నేతలు చర్చలకు వస్తారని తాను కార్యాలయంలో ఉదయం నుంచి ఎదురు చూస్తున్నానని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు. చర్చలు జరపాలని కోర్టు నుంచి ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఇరుపక్షాల మధ్య చర్చలు ఉంటాయని హైకోర్టు సూచించినట్లు మీడియా కథనాల్లో చూశానన్నారు.

, ,
10/20/2019 - 01:00

నల్లగొండ : రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచార పర్వం శనివారంతో ముగిసింది. ఈనెల 21న జరిగే పోలింగ్‌లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఓటర్లను ఆకట్టుకునేందుకు విరామం లేకుండా ఆహర్నిశలు ప్రచార పర్వాన్ని పోటాపోటీగా సాగించారు.

10/20/2019 - 00:50

హైదరాబాద్: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం బంద్ ముగించుకున్న తర్వాత జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతుతో బంద్ సక్సెస్ కావడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. సకల జనులు బంద్‌లో పాల్గొనడం పట్ల వారు స్వాగతించారు.

10/20/2019 - 00:49

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ వ్యాప్తంగా శనివారం ఉద్రిక్తత, నిరసనలు, అరెస్టుల మధ్య బంద్ సక్సెస్ అయ్యింది. హైదరాబాద్ జంటనగరాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, రాజకీయ అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొనడంతో ఉద్రిక్తత, అరెస్టులు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

10/19/2019 - 16:47

హైదరాబాద్: విద్యుత్ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌లోసి విద్యుత్ సౌధలో విద్యుత్ సంస్థల సీఎండీలతో కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చలలో పలు డిమాండ్లను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా తెలిపారు. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు.

Pages