S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/17/2016 - 06:54

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని పార్టీలూ సమాయత్తమయ్యాయి. ఈ సందర్భంగా హన్మకొండలో బిజెపి నిర్వహించనున్న బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సిపిఐ రాష్ట్ర సమితి నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో విలీన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

09/17/2016 - 06:53

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్‌కు ప్రాంతీయ బాహ్య వలయ రహదారి (రీజినల్ రింగ్ రోడ్డు) పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి- నర్సాపూర్, తూప్రాన్- గజ్వేల్ జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ 140 కిలో మీటర్లు, చౌటుప్పల్- ఇబ్రహీంపట్నం- ఆమనగల్లు, షాద్‌నగర్- చేవెళ్ల, శంకర్‌పల్లి, కంది 160 కిలో మీటర్లు.

09/17/2016 - 05:55

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రప్రభుత్వానికి రాజ్యాంగంలోని అధికరణ 298 ప్రకారం భూమిని సేకరించే హక్కు, కొనుగోలు చేసే హక్కు ఉందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుటకు సంబంధించి జీవో 123ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించింది.

09/17/2016 - 05:54

హైదరాబాద్, సెప్టెంబర్ 16: జిల్లాల పునర్ విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే శంషాబాద్ జిల్లాలో కలుపాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అలాగే వరంగల్ జిల్లా చిన్నగూడూరును కొత్త మండలంగా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిని తుది నోటిఫికేషన్‌లో పొందుపర్చాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

09/17/2016 - 05:50

హైదరాబాద్, సెప్టెంబర్ 16: చెరువుల్లోని చేప పిల్లలను కూడా స్వాహా చేసే వారికి చెక్ పెట్టే విధంగా మత్స్య శాఖ కొత్త విధానం అవలంభిస్తోంది. చెరువుల్లో గతంలో చేప పిల్లలను వదిలినట్టు రికార్డుల్లో చూపించేవారు.

09/17/2016 - 05:49

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వచ్చే నెల 11వ తేది నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న కొత్త జిల్లాల్లో 7వ తేదీకల్లా సర్వం సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల పురోగతిపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో రాజీవ్ శర్మ శుక్రవారం సమావేశమయ్యారు. కొత్త జిల్లాలు కొలువుదీరడానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

09/17/2016 - 05:35

సరిగ్గా సాయంత్రం 5 గంటలు.

09/17/2016 - 05:23

హైదరాబాద్, సెప్టెంబర్ 16: గోవాలో ఐటి రంగం అభివృద్ధికి సహకారం అందించేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ, గోవా రాష్ట్రాల మధ్య ఐటి అభివృద్ధిపై శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఐటి మంత్రి కె తారక రామారావు గోవా సిఎం లక్ష్మీకాంత్ పర్సెకర్‌తో శుక్రవారం గోవాలో సమావేశమయ్యారు. తెలంగాణ- గోవా రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో సహకారానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.

09/17/2016 - 05:23

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాష్టవ్య్రాప్తంగా 160 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 71 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయని, మిగతా 89 పాఠశాలలను వెంటనే మంజూరు చేయనున్నట్టు చెప్పారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మైనార్టీ గురుకుల పాఠశాలలపై సిఎం సమీక్ష జరిపారు.

09/16/2016 - 18:04

హైదరాబాద్‌: మెహదీపట్నంలో పీవీ నర్సింహరావు ఫ్లైఓవర్‌పై శుక్రవారం నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఓ వైపు జోరున వర్షం కురవడం, మరోవైపు ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Pages