S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/16/2016 - 17:56

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీంతో తనకు 1986 నుంచే పరిచయం ఉందని, అతడితో కలిసి తాను ఎప్పుడూ ఆర్థిక సెటిల్మెంట్లతో పాల్గొనలేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య శుక్రవారం స్పష్టం చేశారు. అమాయకులను వేధించవద్దని అతడితో చెప్పానని, నయీం సెటిల్మెంట్లలో తన ప్రమేయం ఉందని రుజువు అయితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. నయీం బాధితులు చాలామంది తనను గతంలో ఆశ్రయించారని తెలిపారు.

09/16/2016 - 17:14

ఖమ్మం : ఆరెంపుల లోని నల్లకుంట చెరువులో పడి శుక్రవారం ఇద్దరు యువకులు మృతిచెందారు. కుసుమా మస్తాన్‌(24), మెట్టకోలు ఉదయకుమర్‌(17) అనే ఇద్దరు యువకులు ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఉదయ్‌కుమార్‌ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు మస్తాన్‌ ప్రయత్నించగా ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు.

09/16/2016 - 17:11

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బంజారాహిల్స్‌లో కుండపోత వాన పడింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌, కోఠిలో భారీగా వర్షం పడుతోంది.

09/16/2016 - 17:07

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో శుక్రవారం వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి చెప్పారు. వర్షం కురిసినప్పటికీ సిబ్బంది విధుల్లో చురుగ్గా పాల్గొన్నారని ప్రశంసించారు. నిమజ్జనోత్సవంలో అన్ని శాఖలు అద్భుత సమన్వయంతో పనిచేశాయని చెప్పారు.

09/16/2016 - 16:40

హైదరాబాద్: ప్రస్తుత డిజైన్ ప్రకారం పోలవరం నిర్మిస్తే భద్రాచలం, దుమ్ముగూడెం, మణుగూరుకు ప్రమాదం పొంచి ఉందని, పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని ఎమ్మెల్సీ పొంగులేటి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా కేసీఆర్‌ స్పందించటం లేదని పొంగులేటి మండిపడ్డారు.

09/16/2016 - 16:18

హైదరాబాద్: మెదక్ జిల్లా కుకునూరు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ తీరుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త ఆత్మహత్యకు డిఎస్పీ, సిఐల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు రామకృష్ణారెడ్డి భార్య హైకోర్టుకు విన్నవించారు. దీంతో డిఎస్పీ, సిఐలపై ఎఫ్‌ఐఆర్‌లను ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

09/16/2016 - 15:33

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌-19 జట్టులో సభ్యుడు సాయినాథ్‌ డెంగ్యూతో శుక్రవారం మృత్యువాతపడ్డాడు. మూడు రోజుల కిందట జ్వరం రావడంతో ఉప్పల్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

09/16/2016 - 12:32

దిల్లీ: ఓటుకు నోటు కేసు నుంచి మత్తయ్యను తొలగిస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మత్తయ్య తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

09/16/2016 - 11:31

హైదరాబాద్‌: గురువారం సాయంత్రం నిమజ్జనం చూసి వస్తామని ఇంట్లో చెప్పిన నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని అచ్చయ్యనగర్‌కు చెందిన . గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

09/16/2016 - 07:13

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో రాయలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే నిర్వాసితులకు చట్టప్రకారం నగదు చెల్లింపుల బెనిఫిట్‌ను వర్తింప చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గ్రామానికి చెందిన 39 మంది హైకోర్టులో లంచ్‌మోషన్‌గా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.

Pages